అంతర్మధనంలో కీర్తి సురేష్ !
వాస్తవానికి ఈమూవీలో చిరంజీవి పక్కన చెల్లెలుగా నటించే అవకాశం మొదట్లో సాయి పల్లవికి వచ్చింది. అయితే ఆమె ఆ అవకాశాన్ని వదులు కోవడంతో ఆమె స్థానంలో కీర్తి సురేష్ వచ్చి చేరింది. గతంలో అక్కినేని నందమూరి సీనియర్ హీరోలకు మహానటి సావిత్రి చెల్లెలుగా చేసి మెప్పించిన సందర్భాలు ఉన్నాయి.
ఇప్పుడు అదే ట్రెండ్ ను కొనసాగించాలని కీర్తి సురేష్ ప్రయత్నం చేసినప్పటికీ ఆ ప్రయత్నానికి ఫలితం దక్కలేదు అని అంటున్నారు. ఈ సంవత్సరం సంక్రాంతికి విడుదల అయిన రజనీకాంత్ నటించిన అన్నాతే ‘పెద్దన్న’ మూవీలో కూడ కీర్తి రజనీకాంత్ పక్కన చెల్లెలుగా నటించింది. ఈ రెండు సినిమాలు కూడ ఫ్లాప్ లుగా మారడంతో ఇక ఈమె మాత్రమే కాదు క్రేజ్ ఉన్న ఏటాప్ హీరోయిన్ చెల్లెలుగా నటించే విషయంలో టాప్ హీరోల పక్కన నటించే విషయంలో ఇక సాహసం చేయకపోవచ్చు అన్న సంకేతాలు వస్తున్నాయి.
ఈ రెండు సినిమాలు కనీసం ఏవరేజ్ టాక్ అనిపించుకున్నా కొంతమేరకు కీర్తికి ఊరట దక్కేది. ‘మహానటి’ మూవీ తరువాత ఆమెకు నాని పక్కన నటించిన ‘దసరా’ మూవీలో ఆమె నటించిన వెన్నెల పాత్రకు మంచి పేరు వచ్చినప్పటికీ ఆమెకు చెప్పుకోతగ్గ అవకాశాలు రావడం లేదు. దీనితో ఆమె కెరియర్ పరంగా అంతర్మధనంలో ఉంది అన్న మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే సాయి పల్లవి టాలీవుడ్ ఇండస్ట్రీకి దూరం అయింది అన్న కామెంట్స్ వస్తున్నాయి. దీనితో ఇదే పరిస్థితి కీర్తికి కూడ ఎదురౌతుందా అంటూ మరికొందరు సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..