మెగాస్టార్ చిరంజీవి తాజాగా భోళా శంకర్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ఆగస్టు 11 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా ధియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే ఈ సినిమా విడుదల అయిన మొదటి రోజు బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టింది. ప్రస్తుతం కూడా ఈ మూవీ డీసెంట్ కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర వసూలు చేస్తుంది. ఇకపోతే ప్రస్తుతం థియేటర్ లలో రన్ అవుతున్న ఈ సినిమాకు సంబంధించిన ఓ క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
అసలు విషయం లోకి వెళితే ... ఇప్పటికే ఈ మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ఈ మూవీ మేకర్స్ ఓ ప్రముఖ సంస్థకు అమ్మి వేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా యొక్క డిజిటల్ హక్కులను ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో ఒకటి అయినటు వంటి నెట్ ఫ్లిక్స్ సంస్థ కు అమ్మి వేసినట్లు అందులో భాగంగా ఈ సంస్థ వారు ఈ సినిమాను కొన్ని వారాల థియేటర్ రన్ ముగిసిన తర్వాతతమ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.
ఇకపోతే మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించగా ... అనిల్ సుంకర ఈ సినిమాను నిర్మించారు. మహానటి కీర్తి సురేష్ ఈ మూవీ లో చిరంజీవి కి చెల్లెలు పాత్రలో నటించగా ... సుశాంత్ ఈ మూవీ లో కీర్తి సురేష్ కు లవర్ పాత్రలో నటించాడు. మహతి స్వర సాగర్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే చిరంజీవి తన తదుపరి మూవీ ని కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో చేయబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ మరి కొన్ని రోజుల్లోనే ప్రారంభం కాబోతుంది.