వెండితెరపై మరోక స్వాతంత్ర యోధుడి కథ...!!

Divya
మన దేశాన్ని బ్రిటిష్ వారు పాలించారని విషయం ప్రతి ఒక్కరికి తెలిసిందే..వారి నుంచి మనం స్వతంత్రం రావడం కోసం చాలానే మనవాళ్లు కష్టపడ్డారని వార్తలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అందుకే ఎంతోమంది స్వతంత్ర సమరయోధుల గురించి ఇప్పటికీ మనం ఎన్నో విషయాలు వింటూనే ఉంటాము. అయితే స్వతంత్రం వచ్చిన తర్వాత రజకార్లు పెత్తనం చేశారట ..ఆ రజకర్ల పైన కూడా పోరాడిన వారు చాలామంది ఉన్నట్లు తెలుస్తోంది. అలా పోరాడి ప్రాణతాగం చేసిన వారు చాలా తక్కువ మంది ఉన్నారు. వారిలో బత్తిని మొగిలయ్య గౌడ్ కూడా ఒకరు.


నిజాం రజాకర్ల నుంచి ఎదిరించి మరి ప్రాణతాగం చేసిన వ్యక్తి బత్తిని మొదలయ్య గౌడ్ ఈయన జీవిత కథ ఆధారంగా రజాకర్ అనే ఒక చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. స్వతంత్ర దినోత్సవం సందర్భంగా చిత్ర బృందం ఒక మోషన్ పోస్టర్ని కూడా విడుదల చేయడం జరిగింది. ఇందులో మొగలయ్య పాత్ర దారి జాతీయ జెండాకు సెల్యూట్ చేస్తూ ఉన్నట్లుగా కనిపిస్తోంది. వెనుక నుంచి రజాకర్లు తుపాకీలు ఆయనకు ఎక్కిపెట్టి ఉన్నట్లుగా ఈ పోస్టర్లు చూపించడం జరిగింది. కొద్దిరోజుల క్రితం ఈ సినిమా టైటిల్ పోస్టర్ని విడుదల చేయడం జరిగింది. ఈ పోస్టర్ని హైదరాబాదులో మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు బండి సంజయ్ తదితరులు సైతం ఆవిష్కరించినట్లు తెలుస్తోంది.


హైదరాబాద్ సంస్థానంలో కూడా రజాకర్లు దురగాతాల నుంచి బయటకు తెలియని కొన్ని విషయాలను ఈ చిత్రంలో చూపించబోతున్నట్లు సమాచారం. అందరికీ వాస్తవాలు చూపించే లక్ష్యంతోనే ఈ సినిమాని తీయడం జరుగుతోందట అయితే ఈ సినిమా పోస్టర్ విడుదల చేసే సమయంలో పలు రకాల అభ్యంతరాలు కూడా వినిపించినట్లు సమాచారం. ముస్లిం మత పెద్దలు ఈ సినిమా పైన మండిపడుతున్నారు.. కావాలని రజకర్లను నరహంతకులుగా చూపించబోతున్నట్లు వారు ఫైర్ అవుతున్నారు. 1948 నాటి సంఘటనల ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించి బిజెపి లబ్ధి పొందేందుకే ప్రయత్నిస్తున్నారంటూ విమర్శిస్తున్నారు. ఇందులో బావి సింహ ,అనుష్క త్రిపాటి, వేదిక, మకరంద దేశ్ పాండే కీలకమైన పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం.. ఈ చిత్రాన్ని డైరెక్టర్ సత్యనారాయణ దర్శకత్వం వహిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: