షారూఖ్ ఖాన్ మ్యానియాను లెక్కచేయని అనుష్క !
అనేక దేశాలు తిరిగి వచ్చినా ఆమె సమస్యలకు పరరిష్కారం లభించలేదు. ఇలాంటి సమస్యల మధ్య ఆమె నటించిన ‘మిస్ శెట్టి మిష్టర్ పోలిశెట్టి’ మూవీ విదుల కావలసి ఉంది. వాస్తవానికి ఈసినిమాను ఈనెల మొదటి వారంలో విడుదల చేద్దామని నిర్మాతలు భావించారు. అయితే అనేక వాయిదాలు పడ్డ ఈమూవీ సెప్టెంబర్ 7న విడుదల అయ్యే సంకేతాలు వస్తున్నాయి.
వాస్తవానికి ఈమూవీ పై చెప్పుకోతగ్గ స్థాయిలో అంచనాలు లేకపోయినప్పటికీ అనుష్క ఈమూవీలో నటిస్తూ ఉండటంతో ఈమూవీ ఖచ్చితంగా హిట్ అవుతుందని ఆమె అభిమానులు ఆశిస్తున్నారు. ఈమూవీలో కూడ అనుష్క చాల లావుగా కనిపించడంతో ఆమె లుక్ గ్రాఫిక్స్ ద్వారా నాజూకుగా చూపెట్టడానికి ఈమూవీని నిర్మిస్తున్న యూవీ క్రియేషన్స్ కు చాల భారీ మొత్తంలో ఖర్చులు అయ్యాయి అన్న వార్తలు కూడ వచ్చాయి.
ఇప్పుడు ఆ గ్రాఫిక్స్ వర్క్స్ పనులు పూర్తి కావడంతో వచ్చేనెల 7వ తారీఖున విడుదల చేయడానికి రంగం సిద్ధం చేసుకున్నట్లు టాక్. ఆయితే ఆదేరోజున షారూఖ్ ఖాన్ నటించిన ‘జవాన్’ విడుదల కాబోతోంది. ‘పఠాన్’ మూవీ తరువాత షారూఖ్ ఇమేజ్ ఒక్కసారి మళ్ళీ పెరిగి పోయింది. ఈమూవీ పట్ల కూడ యూత్ లో మంచి క్రేజ్ ఉండి. దేనిహవ ఆ క్రేజ్ ముందు అనుష్క మూవీ నిలబడగలుగుతుందా అన్న సందేహాలు ఉన్నాయి. అయితే ఈమూవీ తన అంచనాలను నిలబెట్టుకుని హిట్ కాగలిగితే షారూఖ్ ఇమేజ్ ని కూడ తట్టుకుని నిలబడగలిగితే అనుష్క మరొకసారి ‘జేజెమ్మ’ లా టాలీవుడ్ ఇండస్ట్రీలో తన ఆధిపత్యాన్ని నిలుపుకుని మళ్ళీ మంచి అవకాశాలు తెచ్చుకునే ఆస్కారం ఉంది..