గోపీచంద్ హీరోగా రూపొందుతున్న "బీమా" మూవీ పరిస్థితి ప్రస్తుతం ఇదే..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మాస్ హీరోగా ఒక మంచి గుర్తింపును తెచ్చుకున్న వారిలో గోపీచంద్ ఒకరు. ఈ నటుడు మొదట సినిమాల్లో హీరోగా నటించినప్పటికీ ఆ తర్వాత విలన్ పాత్రలతోనే అద్భుతమైన గుర్తింపును టాలీవుడ్ ఇండస్ట్రీ లో సంపాదించుకున్నాడు. ఇకపోతే విలన్ గా అద్భుతమైన క్రేజ్ ను సంపాదించుకున్న ఈ నటుడు ఆ తర్వాత మళ్లీ సినిమాల్లో హీరోగా నటించడం మొదలు పెట్టి అందులో భాగంగా ఇప్పటికే హీరోగా అనేక విజయాలను అందుకున్నాడు. ఇకపోతే ఆఖరుగా ఈ నటుడు శ్రీ వాసు దర్శకత్వంలో రూపొందిన రామబాణం అనే పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ అపజయం ఎదుర్కొంది.


ఇకపోతే ప్రస్తుతం ఈ నటుడు బీమా అనే మరో యక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమాకు కన్నడ సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన దర్శకులలో ఒకరు అయినటువంటి ఏ హర్ష దర్శకత్వం వహిస్తున్నాడు. ఇది వరకు ఈ దర్శకుడు వేద అనే కన్నడ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమాకు రవి బుస్రుర్ సంగీతం అందిస్తూ ఉండగా ... కే కే రాధా మోహన్ ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. ఇకపోతే ఈ సినిమాను భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ గా రూపొందిస్తున్నారు. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈ సినిమాలో మాల్విక శర్మ హీరోయిన్ గా నటించబోతున్నట్లు ఈ మూవీ బృందం ప్రకటించింది.


తాజాగా ఈ మూవీ లో మరో హీరోయిన్ గా మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి ప్రియ భవాని శంకర్ కూడా కనిపించబోతున్నట్లు ఈ మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ ఫుల్ స్పీడ్ లో జరుగుతుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ అద్భుతంగా వస్తున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ తో గోపీచంద్ ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: