ఆ తేదీన బుల్లితెరపై ప్రసారం కానున్న "విమానం" సినిమా..!

Pulgam Srinivas
శివ ప్రసాద్ యానాల అనే దర్శకుడు తాజాగా విమానం అనే సినిమాను రూపొందించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో నటుడు మరియు దర్శకుడు అయినటు వంటి సముద్ర ఖని ప్రధాన పాత్రలో నటించగా ... ధనరాజ్ ... రాహుల్ రామకృష్ణ ... అనసూయ ఈ మూవీ లో కీలక పాత్రలో నటించారు. ఇకపోతే ఈ సినిమాలో ధనరాజ్ ఆటో నడుపు కునే వ్యక్తి పాత్రలో కనిపించగా ... రాహుల్ రామకృష్ణ చెప్పులు కొట్టుకునే వ్యక్తి పాత్రలో కనిపించాడు . ఇకపోతే అనసూయ ఈ మూవీ లో వేశ్య పాత్రలో నటించింది. ఈ సినిమాలో నటించిన నటులు అందరూ తమ తమ పరిధి మేరకు అద్భుతమైన రీతి లో నటించి ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలను అందుకున్నారు .


ఇకపోతే కొంత కాలం క్రితమే థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయం సాధించింది. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను కూడా అద్భుతమైన రీతి లో అలరించింది . ఇలా ఇప్పటికే థియేటర్ ... "ఓ టి టి" ఫ్లాట్ ఫామ్ ప్రేక్షకులను ఎంత గానో అలరించిన ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది . ఈ మూవీ సాటిలైట్ హక్కులను జీ సంస్థ దక్కించుకుంది . అందులో భాగంగా ఈ మూవీ ని ఈ ఆదివారం అనగా ఆగస్టు 13 వ తేదీన సాయంత్రం 6 గంటల 30 నిమిషాలకు వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా జీ తెలుగు ఛానల్ లో ప్రసారం చేయనుంది . మరి ఈ మూవీ బుల్లి తెర ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి .

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: