ఆ తేదీన "వెంకీ" మూవీ రిలీజ్..!

Pulgam Srinivas
మాస్ మహారాజ రవితేజ కెరియర్ లో అద్భుతమైన విజయం సాధించిన మూవీ లలో వెంకీ మూవీ ఒకటి. ఈ మూవీ లో స్నేహ ... రవితేజ సరసన హీరోయిన్ గ నటించగా ... తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకుల్లో ఒకరిగా చాలా సంవత్సరాల పాటు కెరియర్ ను కొనసాగించిన శ్రీను వైట్ల ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ కి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమా విజయంలో దేవి శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం కూడా కీలక పాత్రను పోషించింది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ లో బ్రహ్మానందం ... వేణుమాధవ్ ముఖ్య పాత్రలలో నటించారు.


ఈ మూవీ లో ట్రైన్ లో వచ్చే సన్నివేశాలలో రవితేజ కు బ్రహ్మానందం కు మధ్య వచ్చే కామెడీ సీన్స్ అద్భుతంగా పండాయి. ఇప్పటికి కూడా ఈ కామిడీ సన్నివేశాలకు ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తూ ఉంటుంది. ఇకపోతే ఈ సినిమా 26 మార్చ్ 2004 వ సంవత్సరం విడుదల అయ్యి అద్భుతమైన విజయాన్ని అందుకొని భారీ కలెక్షన్ లను కూడా వసూలు చేసింది. అలా ఆ సమయంలో మంచి విజయం సాధించిన ఈ సినిమాను తిరిగి మళ్లీ థియేటర్ లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.


ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం వెంకీ మూవీ ని ఈ సంవత్సరం డిసెంబర్ 30 వ తేదీన భారీ ఎత్తున థియేటర్ లలో రీ రిలీజ్ రిలీజ్ చేయడానికి ఈ మూవీ మేకర్స్ ప్లాన్స్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ మూవీ రీ రిలీజ్ కోసం రవితేజ అభిమానులతో పాటు మామూలు సినీ ప్రేమికుల కూడా ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ఇకపోతే ఈ సినిమాకు శ్రీను వైట్ల ... కోన వెంకట్ ... గోపి మోహన్ కలిసి కథను రెడీ చేయగా ... ఈ మూవీ లో రాశి ఓ స్పెషల్ సాంగ్ లో నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: