చిరంజీవి 'అన్నయ్య' మూవీలో తమ్ముళ్ల పాత్ర కోసం.. రవితేజ, వెంకట్ ను అనుకోలేదట తెలుసా?
అయితే ఇప్పుడు చిరంజీవి కెరియర్ లో సూపర్ హిట్గా నిలిచిన ఒక సినిమాకు సంబంధించిన వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారిపోయింది. చిరంజీవి కెరియర్ లో ఎన్నో హిట్ మూవీస్ ఉండగా.. అందులో అన్నయ్య సినిమా కూడా ఒకటి అన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా సౌందర్య హీరోయిన్ గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అయింది. ఈ సినిమాలో చిరంజీవి తమ్ముళ్లుగా రవితేజ, వెంకట్ నటించారు. ఇక ఈ సినిమా ద్వారా వారికి కూడా మంచి గుర్తింపు వచ్చింది అని చెప్పాలి.
అయితే అన్నయ్య సినిమాలో తమ్ముళ్లుగా ముందుగా రవితేజ వెంకట్ లను అనుకోలేదట. ఈ పాత్రల కోసం జెడి చక్రవర్తి, శ్రీకాంత్ అయితే బాగుంటుందని దర్శకనిర్మాతలు భావించారట. ఈ క్రమంలోనే అన్నయ్య సినిమా దర్శకుడు ముత్యాల సుబ్బయ్య ఇక చిరంజీవి తమ్ముళ్ళ పాత్రల కోసం శ్రీకాంత్, జేడీ చక్రవర్తిని సంప్రదించాడట. అప్పటికే హీరోగా శ్రీకాంత్ సినిమాలు చేస్తున్నాడు. జెడి చక్రవర్తి కూడా వేరే సినిమాల తో బిజీగా ఉన్నాడు దీంతో ఇక అన్నయ్య సినిమా కోసం డేట్స్ అడ్జస్ట్ చేయలేకపోయారట. ఇక తర్వాత ఈ అవకాశం రవితేజ వెంకట్ లకు దక్కింది. ఇక ఈ పాత్రల ద్వారా వీరిద్దరికి కూడా మంచి క్రేజ్ కూడా వచ్చింది అని చెప్పాలి.