మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరియర్ లో బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన సినిమాలలో రంగస్థలం మూవీ ఒకటి. ఈ సినిమాకు తెలుగు సినిమా ఇండస్ట్రీ లో టాప్ దర్శకులలో ఒకరు అయినటువంటి సుకుమార్ దర్శకత్వం వహించగా ... ఈ మూవీ లో టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరు అయినటువంటి సమంత హీరోయిన్ గా నటించింది. ఆది పినిశెట్టి ఈ మూవీ లో చరణ్ కి సోదరుడి పాత్రలో నటించగా ... జగపతి బాబు ... ప్రకాష్ రాజ్ ఈ మూవీ లో విలన్ పాత్రలలో నటించారు. రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ మూవీ కి సంగీతం అందించగా ... మైత్రి సంస్థ వారు ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించారు.
అనసూయ ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్రలో నటించగా ... పూజా హెగ్డే ఈ మూవీ లో ఒక స్పెషల్ సాంగ్ లో నటించింది. 2018 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడం మాత్రమే కాకుండా బాక్స్ ఆఫీస్ దగ్గర కలెక్షన్ ల వర్షన్ని కురిపించింది. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇలా బ్లాక్ బస్టర్ విజయం సాధించి అద్భుతమైన కలెక్షన్ లను రాబట్టిన ఈ సినిమాను కొన్ని రోజుల క్రితమే భారీ ఎత్తున జపాన్ లో విడుదల చేశారు.
ఇకపోతే ఈ సినిమాకు జపాన్ లో కూడా ప్రేక్షకుల నుండి అద్భుతమైన రెస్పాన్ లభిస్తుంది. దానితో ఇప్పటి వరకు ఈ సినిమాకు జపాన్ లో 1.4 కోట్ల కలెక్షన్ లు లభించినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఇప్పటికీ కూడా ఈ సినిమా జపాన్ లో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇలా ఈ సినిమా జపాన్ ప్రేక్షకులను అద్భుతమైన రీతిలో అలరిస్తోంది.