ఆ కారణం చేత స్టార్ డైరెక్టర్ సినిమాను రిజెక్ట్ చేసిన అల్లు అర్జున్....!!

murali krishna
టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం సినిమాలలో నటిస్తూ బిజీబిజీగా గడుపుతున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలలో వినిపిస్తూనే మరొకవైపు కమర్షియల్ యాడ్స్ లో నటిస్తూ బిజీ బిజీగా గడుపుతున్నారు అల్లు అర్జున్.కాగా అల్లు అర్జున్ పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన విషయం తెలిసిందే. ఈ సినిమాతో అల్లు అర్జున్ క్రేజ్ మరింత పెరిగింది. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప 2 మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో భాగంగా బిజీబిజీగా గడుపుతున్నారు అల్లు అర్జున్.ఈ సినిమా అనంతరం త్రివిక్రమ్ తో ఒక సినిమాను చేయనున్నారు. అలాగే మరో బాలీవుడ్ డైరెక్టర్ తో కూడా సినిమా చేయబోతున్నట్లు వార్తలు వినిపించాయి. మొదట్లో ఓకే చెప్పిన అల్లు అర్జున్ ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ కి నో చెప్పినట్టు తెలుస్తోంది. అందుకు గల కారణం ప్రభాస్ అని తెలుస్తోంది.

మరి ఆ వివరాల్లోకి వెళితే.. తాజాగా అందిన సమాచారం ప్రకారం ఆ దర్శకుడికి బన్నీ నో చెప్పారట. ఆయన ఎవరో కాదు. బడా డెరెక్టర్ ఆధిత్య ధర్.ఆయన దర్శకత్వంలో బన్నీ ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ అనే సినిమా చేయాల్సి ఉంది. ఇది ఆ డెరెక్టర్ డ్రీమ్ ప్రాజెక్టు. ది ఇమ్మోర్టల్ అశ్వత్థామ సినిమాను జియో స్టూడియోస్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించనుంది.ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా ఎంపిక అయ్యారు. త్వరలోనే అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

కానీ ఏమైందో ఏమో తెలియదు కానీ ఈ సినిమాకు బన్నీ నో చెప్పారట. దానికి కారణం ప్రభాస్ అని తెలుస్తోంది. ప్రభాస్ కూడా ఈ మధ్య బాలీవుడ్ దర్శకులతో సినిమాలు తీయకూడదని నిర్ణయం తీసుకున్నారట. ఆది పురుష్ దెబ్బకు ప్రభాస్..బాలీవుడ్ దర్శకులకు నో చెప్పారని తెలుస్తోంది. అలా ప్రభాస్ బాటలోనే బన్నీ కూడా వెళ్తున్నారనే కామెంట్స్ వస్తున్నాయి. ఒక్క ఓం రౌత్ చేసిన పనికి బాలీవుడ్ దర్శకులకు ఛాన్స్ లు ఇవ్వకపోవడం ఏంటనే కామెంట్స్ కూడా వినిపిస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: