రామ్ చరణ్ "గేమ్ చేంజర్" లేటెస్ట్ క్రేజీ అప్డేట్ న్యూస్..?

frame రామ్ చరణ్ "గేమ్ చేంజర్" లేటెస్ట్ క్రేజీ అప్డేట్ న్యూస్..?

Pulgam Srinivas
టాలీవుడ్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇకపోతే చరణ్ ప్రస్తుతం ఇండియా లోనే సూపర్ టాలెంటెడ్ దర్శకుడుగా పేరు తెచ్చుకున్న శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న గేమ్ చేంజర్ అనే భారీ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు అత్యంత భారీ బడ్జెట్ తో ... అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నాడు.


ఈ మూవీ లో కియారా అద్వానీ ... చరణ్ సరసన హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... నటుడు మరియు దర్శకుడు అయినటువంటి ఎస్ జె సూర్య ఈ మూవీ లో ప్రధాన ప్రతి నాయకుడి పాత్రలో కనిపించబోతున్నాడు. అంజలి , సునీల్ , శ్రీకాంత్ ఈ మూవీ లో ముఖ్య పాత్రలలో కనిపించనుండగా ... తమన్ ఈ మూవీ కి సంగీతం అందిస్తున్నాడు. ఇకపోతే ఈ మూవీ షూటింగ్ ఇప్పటికే చాలా వరకు పూర్తి అయ్యింది. మరి కొన్ని రోజుల్లోనే ఈ మూవీ మొత్తం షూటింగ్ పూర్తి కాబోతున్నట్టు తెలుస్తుంది. ఇకపోతే ఈ మూవీ యొక్క లేటెస్ట్ షెడ్యూల్ షూటింగ్ ఈ రోజు నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ రోజు నుండి ప్రారంభం కాబోయే ఈ మూవీ షెడ్యూల్ దాదాపు రెండు వారాల పాటు కొనసాగనున్నట్లు సమాచారం. ఈ షెడ్యూల్ లో ఈ మూవీ మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన చాలా కీలక సన్నివేశాలను చిత్రీకరించబోతున్నట్లు తెలుస్తుంది.  ఇకపోతే ఈ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ లోని కేవలం పాటల చిత్రీకరణ కోసమే 100 కోట్ల వరకు బడ్జెట్ ను ఈ మూవీ నిర్మాత ఖర్చు చేసినట్లు తెలుస్తోంది.


ఈ మూవీ షూటింగ్ పూర్తి అయిన వెంటనే ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ లను పనులను ఈ మూవీ మేకర్స్ ప్రారంభించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ లో చరణ్ తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను అలరించే అవకాశాలు చాలా వరకు ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే శంకర్ ... చరణ్ హీరోగా రూపొందుతున్న గేమ్ చేంజర్ మూవీ తో పాటు ఇండియన్ 2 మూవీ ని కూడా పూర్తి చేస్తూ వస్తున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: