"భోళా శంకర్" మూవీ నుండి "కొట్టరా కొట్టు తీన్మార్" సాంగ్ విడుదల..!

Pulgam Srinivas
మెగాస్టార్ చిరంజీవి పోయిన సంవత్సరం ఆచార్య ... గాడ్ ఫాదర్ మూవీ లతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ లలో ఆచార్య మూవీ ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహపరచగా పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రూపొందిన గాడ్ ఫాదర్ మూవీ ప్రేక్షకులను పర్వాలేదు అనే రేంజ్ లో అలరించింది. ఇకపోతే ఈ సంవత్సరం చిరంజీవి "వాల్టేరు వీరయ్య" అనే పక్కా కమర్షియల్ మాస్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే ఈ సంవత్సరం చిరంజీవి "భోళా శంకర్" అనే మరో కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ మూవీ ఆగస్టు 11 వ తేదీన థియేటర్ లలో విడుదల కానుంది. మెహర్ రమేష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా హీరోయిన్ గా నటించగా ... కీర్తి సురేష్ ... సుశాంత్మూవీ లో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.
 


మహతీ స్వర సాగర్ ఈ మూవీ కి సంగీతం అందించగా ... ఈ సినిమాని అనిల్ సుంకర నిర్మించాడు. ఇకపోతే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి అనేక ప్రచార చిత్రాలను విడుదల చేసింది. ఇక తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి "కొట్టరా కొట్టు తీన్మార్" అంటూ సాగే సాంగ్ ను విడుదల చేసింది. ఈ సాంగ్ కి ప్రేక్షకుల నుండి డీసెంట్ రెస్పాన్స్ లభిస్తుంది. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ కి సంబంధించిన టికెట్ బుకింగ్ లను ఈ మూవీ మేకర్స్ ఓపెన్ చేయగా వాటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ లభిస్తుంది. మరి ఈ మూవీ కి మంచి టాక్ కనుక వచ్చినట్లు అయితే భారీ ఓపెనింగ్ లు లభించే అవకాశాలు చాలా వరకు ఉన్నాయి. మరి ఈ మూవీ ఎలాంటి టాక్ ను తెచ్చుకుంటుందో ... ఏ రోజు ఓపెనింగ్ లను తెచ్చుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: