అభిమానులను నిరాశకు గురి చేస్తున్న నందమూరి కుటుంబం...!!

murali krishna
ఈ మధ్య కాలంలో మెగా ఫ్యామిలీ కి చెందిన హీరోల సినిమా లకు నెలకు ఒకటి లేదా రెండు వస్తూనే ఉన్నాయి. చిన్న హీరోలు పెద్ద హీరోలు కలిపి చాలా మంది మెగా ఫ్యామిలీ హీరోల సినిమా లు వస్తున్నాయి.కానీ ఇతర ఫ్యామిలీల హీరోల సినిమాలు రావడం లేదు. మెగా ఫ్యామిలీ తో పోల్చితే నందమూరి ఫ్యామిలీ హీరోలు కూడా వరుసగా సినిమాలు చేయాల్సి ఉంది. కానీ వారు మాత్రం పెద్దగా సినిమాలతో సందడి చేయడం లేదు. మోక్షజ్ఞ ఎంట్రీ గురించి ఇప్పటి వరకు క్లారిటీ ఇవ్వడం లేదు.అంతే కాకుండా నందమూరి ఫ్యామిలీకి చెందిన కళ్యాణ్ రామ్‌ తో పాటు ఇతర హీరోల సినిమాలు చాలా స్లోగా వస్తున్నాయి. అదుగో ఇదుగో అన్నట్లుగా కళ్యాణ్ రామ్‌ సినిమా లు కూడా విడుదల వాయిదాలు పడుతున్నాయి.

ఇక బాలయ్య గతంలో స్పీడ్ గా సినిమాలు చేసినా కూడా ఈ మధ్య కాలంలో మాత్రం సినిమాల సంఖ్య తగ్గించినట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు బాలయ్య కొత్త సినిమా షూటింగ్‌ అప్డేట్‌ ఇవ్వలేదు. భగవంత్ కేసరి సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో బాలయ్య సినిమా ఉంటుందని కన్ఫర్మ్‌ అయింది.కానీ ఆ విషయంలో ఫ్యాన్స్ ను ఉత్సాహ పరిచే వార్త ఒకటి కూడా రావడం లేదు.మొత్తానికి బాలయ్య ఫ్యాన్స్ కి నిరాశ మిగుల్చుతున్నారు. ఇక కళ్యాణ్‌ రామ్ సినిమాలు ఎప్పుడు వస్తున్నాయో.. ఎప్పుడు పోతున్నాయో క్లారిటీ లేదు. ఆయన నుండి వరుసగా సినిమాలు వస్తాయని అప్పుడప్పుడు వార్తలు వస్తూ ఉన్నాయి.కానీ ఇప్పటి వరకు కళ్యాణ్ రామ్‌ కొత్త సినిమా అప్డేట్ రావడం లేదు. రెండు సినిమా లు లైన్‌ లో పెట్టిన ఈ నందమూరి హీరో ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ ను మాత్రం చెప్పడం లేదు. మొత్తానికి ఈ మధ్య నందమూరి అభిమానులకు వరుసగా నిరాశే మిగులుతోంది అంటూ కొందరు కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: