టికెట్ల రేటు విషయంలో భయపడుతున్న సినీ ఇండస్ట్రీ..!!
RRR చిత్రానికి రేట్లు పెంచడంతో ఈ సినిమా టికెట్ల రేట్లు పెంచే ట్రెండు మొదలైంది. అప్పటివరకు ఎంత బడ్జెట్ తీసిన సరే ఎలాంటి పరిస్థితుల్లో ఉన్న టికెట్లు రేటు సాధారణంగా ఉండేది.కానీ బడ్జెట్ బాధలు ప్రభుత్వం దగ్గర విన్నవించుకోవడంతో నిర్మాతలు సైతం రెండు తెలుగు రాష్ట్రాలలోని ముఖ్యమంత్రులను అడిగి మరి టికెట్ల రేట్లు పెంచుకోవడం జరిగింది ఇలా కొన్ని సినిమాలకు మాత్రమే వర్కౌట్ అయిన మరికొన్ని సినిమాలు మాత్రం టికెట్ల రేట్ల వల్ల ప్రేక్షకులు థియేటర్ల వద్దకు రావడానికి కూడా భయపడేలా చేస్తున్నారు.
ముఖ్యంగా స్టార్ హీరోల సినిమాలు మార్నింగ్ షో ఫుల్ కూడా కాలేదు ఒకప్పుడు మార్నింగ్ షో టికెట్ కోసం చాలా కష్టాలు పడాల్సి వచ్చేది ఇప్పుడు రేటు తాకిడికి కౌంటర్లు నిలబడే వాళ్లే కూడా లేరు అన్నట్లుగా తెలుస్తోంది. దీన్ని బట్టి చూస్తే స్టార్ హీరోల క్రేజ్ తగ్గిందా లేకపోతే పెరిగిన టికెట్ల రేటు వల్ల ఆడియన్స్ సినిమాలకు దూరంగా అవుతున్నారా అనే విషయం అందరిలోనూ కలుగుతుంది ప్రస్తుతం 295 రూపాయలు ఉన్న టికెట్ 350 వరకు పెరిగింది. ఏపీలో అయితే 220 రూపాయలు అన్నట్టుగా తెలుస్తోంది. టికెట్ల రేట్లు పెరుగుదల వల్ల భారీ కలెక్షన్లు రావడం మాట పక్కన పెడితే కనీసం మొదటి రోజు థియేటర్లకు జనాలు రావడానికి కూడా భయభ్రాంతులకు గురవుతున్నారు దీంతో టికెట్ల రేట్లు కూడా పెంచలేదని తెలుస్తోంది సింగల్ స్క్రీన్ కి 175 రూపాయలు మల్టీప్లెక్స్ థియేటర్ కి 295 రూపాయలుగా ఉన్నట్లు తెలుస్తోంది.