ప్రతి సంవత్సరం ఎంతో మంది హీరోయిన్ లు టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇస్తున్న విషయం మనకు తెలిసిందే. కానీ అందులో కొంత మంది మాత్రమే ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చిన అతి తక్కువ కాలం లోనే మంచి గుర్తింపును సంపాదించుకుంటున్నారు. అలాంటి వారిలో సంయుక్త మీనన్ ఒకరు. ఈ నటి పోయిన సంవత్సరం విడుదల అయినటువంటి భీమ్లా నాయక్ మూవీ తో టాలీవుడ్ ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత ఈ నటి నటించిన బింబిసారా ... సార్ ... విరూపాక్ష మూవీ లు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ లుగా నిలవడంతో ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మోస్ట్ క్రేజియేస్ట్ బ్యూటీ గా కెరియర్ ను కొనసాగిస్తుంది.
ఇకపోతే ప్రస్తుతం సంయుక్త చేతిలో అనేక క్రేజీ సినిమాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే ప్రస్తుతం వరుస క్రేజీ సినిమా అవకాశాలతో ఫుల్ జోష్ లో ఉన్న ఈ నటి ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటూ వస్తుంది. అలాగే తనకు సంబంధించిన అనేక విషయాలను తన సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు తెలియజేయడం మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను కూడా ఈ ముద్దు గుమ్మ తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది.
అందులో భాగంగా తాజాగా సంయుక్త తన సోషల్ మీడియా అకౌంట్ లో అదిరిపోయే లుక్ లో ఉన్న లైట్ పింక్ కలర్ శారీని కట్టుకొని ... అందుకు తగిన లైట్ పింక్ కలర్ బ్లౌజ్ ను ధరించి డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్ లో ఉన్న ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం సంయుక్త కు సంబంధించిన ఈ ఫోటోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.