గేమ్ చేంజర్ సినిమాలోని పాటల కోసం రూ .100 కోట్లు ఖర్చా..!!
తాజాగా ఈ సినిమా గురించి కొన్ని విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. గేమ్ చేంజర్ పాటలకే దాదాపుగా రూ .100 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. డైరెక్టర్ శంకర్ సినిమాలోని పాటల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. శంకర్ గత చిత్రాలలో పాటలకు ఎక్కువగా గ్రాఫిక్స్ వంటివి ఉపయోగిస్తూ ఉంటారు. ఇప్పుడు చరణ్ సినిమాకు కూడా అలాంటి పనే చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమా మ్యూజిక్ కంపోజర్ తమన్ కూడా అత్యంత క్వాలిటీతో ఈ సినిమా కంపోజర్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
దాదాపుగా పాటలకి రూ.100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నారంటే అభిమానులలో చాలా హైపుని నెలకొందిపేలా చేస్తోంది. గడిచిన రెండు రోజుల క్రితం కియారా అద్వానీ కూడా ఈ సినిమా పైన పలు విషయాలను తెలియజేయడం జరిగింది. ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నది నిర్మాత దిల్ రాజు. పొలిటికల్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్గా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఈ సినిమాని పాన్ ఇండియా లెవెల్లో తెరకెక్కించడం జరుగుతుంది శ్రీకాంత్ సూర్య అంజలి సునీల్ తదితరులు సైతం ఇందులో కీలకమైన పాత్రలు నటిస్తూ ఉన్నారు. మరి భారీ అంచనాల మధ్య ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతున్నట్లు తెలుస్తోంది.