ప్రముఖ యాంకర్ కం దర్శకుడు అయినటువంటి ఓంకార్ తమ్ముడు అశ్విన్ బాబు గురించి తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటుడు ఇప్పటికే అనేక తెలుగు మూవీ లలో హీరో గా నటించి అందులో కొన్ని మూవీ లతో మంచి విజయాలను అందుకొని టాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడు గా తనకంటూ పరవాలేదు అనే రేంజ్ లో గుర్తింపును సంపాదించుకున్నాడు . ఇక పోతే తాజాగా ఈ యువ నటుడు హిడింబా అనే పవర్ఫుల్ యాక్షన్ ప్లస్ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ సినిమాలో నందిత శ్వేత హీరోయిన్ గా నటించగా ... అనిల్ కన్నెగంటి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.
ఈ మూవీ లో శ్రీనివాస్ రెడ్డి ... రఘు కుంచే ... రోబెన్ తిరుమల ముఖ్య పాత్రల్లో నటించారు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయింది. మంచి అంచనాల నడుమ థియేటర్ లలో విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయం అందుకున్న ఈ సినిమా మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.
ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క డిజిటల్ హక్కులను ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ వారు దక్కించుకున్నట్లు తెలుస్తుంది. అందులో భాగంగా ఈ సినిమాను ఆగస్టు 10 వ తేదీ నుండి ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరి కొన్ని రోజుల్లోనే వెలువడబోతున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది.