వాటిని తినడం ఇష్టమంటున్నా నేషనల్ క్రష్ బ్యూటీ రష్మిక....!!
ఇది ఇలా ఉంటే తాజాగా సోషల్ మీడియా లో రష్మిక మందన్నకి సంబందించిన ఒక వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గతంలో జరిగిన ఓ కార్యక్రమంలో తన ఆహార అలవాట్లు చెప్పి షాకిచ్చింది రష్మిక. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ.. తాను పందిమాంసాన్ని ఇష్టంగా తింటానని చెప్పింది.ఆ సామాజిక వర్గ ప్రజల సాంప్రదాయ వంటకం పంది మాసం కావడంతో ఈ వంటకంపై ఆమెకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటుందట.వారి సామాజిక వర్గంలో ఎక్కువగా పంది మాంసం తింటారని రష్మిక స్వయంగా పేర్కోంది. పంది మాంసం తమ సంప్రదాయ వంటకం అని, పందిని నిప్పు మీద కాల్చి తింటామని చెప్పుకొచ్చింది. అంతేకాకుండా వైన్ తో కూడా తాము చాలా చేస్తామని ఒక రకంగా వైన్ కూడా ఇంట్లోనే తయారు చేసుకుంటామని చెబుతూ మరో షాకిచ్చింది. ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్న వైన్‌ని ఆహారం తిన్న తరువాత రెండు గ్లాసులు తాగి పడుకుంటే మంచి నిద్ర పడుతుందని రష్మిక తెలిపింది. ఈ విషయాలు ఆమెనే స్వయంగా వెల్లడించడంతో అవికాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.