సంక్రాంతి బరిలో కన్ఫామ్ అయిన పవన్ మూవీ..?

Pulgam Srinivas
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ "అజ్ఞాతవాసి" మూవీ తర్వాత కొంత కాలం గ్యాప్ తీసుకుని ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. అందులో భాగంగా అజ్ఞాతవాసి మూవీ తర్వాత పవన్ "వకీల్ సాబ్" మూవీ తో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ మంచి విజయం అందుకుంది. ఆ తర్వాత భీమ్లా నాయక్ మూవీ తో మరో విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకున్నాడు. ఇకపోతే తాజాగా "బ్రో" అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ మూవీ కూడా ప్రస్తుతం విజయవంతంగా థియేటర్ లలో ప్రదర్శించబడుతుంది.


ఇకపోతే పవన్ కొంత కాలం క్రితమే టాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్ అనే మూవీ ని ప్రారంభించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో శ్రీ లీల మెయిన్ హీరోయిన్ గా కనిపించనుండగా ... రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు. మైత్రి సంస్థ వారు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇకపోతే ఈ మూవీ లో మరో హీరోయిన్ కూడా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా మరికొన్ని రోజుల్లోనే వెలబడబోతున్నట్లు సమాచారం. ఇకపోతే కొంత కాలం క్రితమే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం అయ్యింది. అలాగే కొంత భాగం షూటింగ్ కూడా పూర్తయింది. ఈ మూవీ నుండి ఒక చిన్న వీడియోను కూడా ఈ మూవీ మేకర్స్ విడుదల చేయగా దానికి ప్రేక్షకుల నుండి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ లభించింది.


ఇకపోతే ఈ మూవీ షూటింగ్ మళ్లీ మొదలు కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీ నెక్స్ట్ షెడ్యూల్ మరో 10 రోజుల్లో ప్రారంభం కాబోతున్నట్లు ... ఈ షెడ్యూల్ లో పవన్ కళ్యాణ్ తో పాటు ఈ సినిమాలో నటిస్తున్న కీలక పాత్రల్లో నటిస్తున్న అందరూ పాల్గొనబోతున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా విడుదల చేసే నేపథ్యంలో ఈ మూవీ షూటింగ్ ను ఇతర పనులను కూడా పూర్తి చేసే ఆలోచనలో ఈ మూవీ మేకర్స్ ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: