అలాంటి రికార్డ్ ఒక్క బాలయ్య బాబూకే సాధ్యం...!!
బాలయ్య నటించిన బంగారు బుల్లోడు, నిప్పురవ్వ సినిమాలు సైతం అదే సెంటిమెంట్ ను ఫాలో అయ్యాయి. ఈ రెండు సినిమాలు ఒకే రోజున థియేటర్ల లో విడుదలయ్యాయి. అయితే ఈ రెండు సినిమాలు థియేటర్ల లో 100 రోజులకు పైగా ప్రదర్శించబడ్డాయి. ప్రపంచం లో బాలయ్య కు మాత్రమే సాధ్యమైన ఈ అరుదైన రికార్డ్ ప్రస్తుతం సోషల్ మీడియా వేదిక గా హాట్ టాపిక్ అవుతుండటం గమనార్హం. అయితే బాలయ్య తన సినిమాల ఫలితాల గురించి, రికార్డుల గురించి పెద్దగా పట్టించుకోరు. చరిత్ర సృష్టించినా, చరిత్ర తిరగరాసినా ఆ ఘనతల గురించి ప్రస్తావించడానికి బాలయ్య పెద్దగా ఇష్టపడరు. టాలీవుడ్ ఇండస్ట్రీలో నిర్మాతల మేలు కోరే అతికొద్ది మంది హీరోలలో బాలయ్య ఒకరు. నిర్మాతల డబ్బులను వృథా చేయడానికి బాలయ్య అస్సలు ఇష్టపడరని ఇండస్ట్రీ లో టాక్ ఉంది.
స్టార్ హీరో బాలకృష్ణ ప్రస్తుతం భగవంత్ కేసరి సినిమా లో నటిసుండగా అతి త్వరలో ఈ సినిమా కు సంబంధించిన అప్ డేట్స్ రానున్నాయి. బాలయ్య సినిమా విడుదలైతే బాక్సాఫీస్ వద్ద ఉండే సందడి అంతాఇంతా కాదు. బాలయ్య సినిమాలను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య ఊహించని స్థాయిలో పెరుగుతోంది. బాలయ్య పారితోషికం భవిష్యత్తు ప్రాజెక్ట్ లకు 30 కోట్ల రూపాయల రేంజ్ లో ఉండనుందని సమాచారం అందుతోంది. బాలయ్యతో సినిమాలను తీయడానికి చాలామంది నిర్మాతలు ఆసక్తి చూపిస్తున్నారు.