వైరల్ గా మారిన శృతిహాసన్ ఇంట్రస్టింగ్ కామెంట్స్....!!

murali krishna
శృతిహాసన్ ప్రస్తుతం తన సెకండ్ ఇన్నింగ్స్ మాత్రం వరుస సినిమా అవకాశాలను అందుకొని ఎంతో బిజీగా ఉన్నారు. ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్నటువంటి ఈమె తన వ్యక్తిగత కారణాల వల్ల కొంతకాలం పాటు ఇండస్ట్రీకి దూరమయ్యారు.ఇలా ఇండస్ట్రీకి దూరమైనటువంటి ఈమె క్రాక్సినిమా ద్వారా తిరిగి ప్రేక్షకుల ముందుకు వచ్చారు.ఇలా ఈ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి శృతిహాసన్ అనంతరం వీరసింహారెడ్డి వాల్తేరు వీరయ్య వంటి బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ అందుకున్నారు.

ఇక ప్రస్తుతం ఈమె ప్రభాస్హీరోగా ప్రశాంత్ నీల్  దర్శకత్వంలో పాన్ ఇండియా స్థాయి లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నటువంటి చిత్రం సలార్  . ఈ సినిమా ద్వారా ఈమె మొదటిసారి ప్రభాస్ సరసన నటించారు. అలాగే ఈమెకు ఇది మొదటి పాన్ ఇండియా సినిమా కావటం విశేషం.ఈ సినిమా సెప్టెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నది.ఇలా సినిమాల పరంగా శృతిహాసన్ ఎంతో బిజీగా ఉన్నప్పటికీ తన వ్యక్తిగత విషయాల గురించి కూడా ఎప్పటికప్పుడు సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ ఉంటారు.

శృతిహాసన్ తన బాయ్ ఫ్రెండ్ శంతను హజారికకు సంబంధించిన విషయాలను కూడా ఈమె అభిమానుల తో పంచుకుంటారు. అయితే తాజాగా సోషల్ మీడియా వేదిక గా శృతిహాసన్ స్పందిస్తూ.. ప్రతిరోజు జీవితంతో యుద్ధం చేయడం మాత్రమే కాదు సరదాగా ఇంట్లో కూర్చుని స్నాక్స్ తింటూ మన పెట్ లను ఎంతో ప్రేమ గా చూసుకోవాలి. నా పెట్ క్లారాతో నేను ఆటలు ఆడుతూ తనను ముద్దులు పెట్టుకుంటూ తనని ప్రేమగా నా ఒళ్లో కూర్చోబెట్టుకోవడం చాలా ముఖ్యమైనదని నేను రియలైజ్ అయ్యాను అంటూ తన పెట్ అనిమల్ గురించి శృతిహాసన్ షేర్ చేసినటువంటి ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: