వైరల్ గా మారిన సినీ నటుడు పృథ్విరాజ్ కామెంట్స్....!!
ఎంత సంపాదించినా చివరికి మట్టి లోకే వెళ్లాలని జీవించి ఉన్న సమయం లో ఆనందంగా ఉండాలని పృథ్వీరాజ్ పేర్కొన్నారు. నా పాత్ర పొలిటికల్ వివాదం అయిందని సినిమా చూసిన చాలామంది ఏపీ మంత్రిని డీగ్రేడ్ చేశారని అడుగుతున్నారని ఆ మంత్రి పేరు అంబటి రాంబాబని చెబుతున్నారని ఆయన ఎవరో నాకు తెలియదని పృథ్వీరాజ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.తెలియని వ్యక్తి ని నేను ఇమిటేట్ చేయాల్సిన అవసరం ఏముందని ఆయన పేర్కొన్నారు. టైం లేదనకూడదని అహంకారం ప్రదర్శించకూడదని ఈ సినిమా ద్వారా నేను నేర్చుకున్నాని పృథ్వీరాజ్ చెప్పుకొచ్చారు. పృథ్వీరాజ్ వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదిక గా వైరల్ అవుతున్నాయి. బ్రో సినిమా తర్వాత పృథ్వీరాజ్ కు సినిమా ఆఫర్లు పెరుగుతాయేమో చూడాల్సి ఉంది. పృథ్వీరాజ్ ను అభిమానించే వాళ్ల సంఖ్య పెరుగుతుండటం గమనార్హం. పృథ్వీరాజ్ వివాదాలకు దూరం గా ఉంటే మంచిదని కామెంట్లు వినిపిస్తున్నాయి.