మెగాస్టార్ అమెరికాకు వెళ్ళడానికి కారణం అదేనా....??

murali krishna
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నారు. వాల్తేరు వీరయ్య సినిమా ద్వారా సూపర్ హిట్ అందుకున్నటువంటి చిరంజీవి త్వరలోనే భోళా శంకర్ సినిమా ద్వారా కూడా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు.ఈ సినిమా ఆగస్టు 11 వ ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలోనే పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను కూడా నిర్వహిస్తున్నారు.ఈ క్రమంలోనే డైరెక్టర్ మెహర్ రమేష్తో కలిసి తమన్నా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
ఈ ఇంటర్వ్యూ సందర్భంగా వీరికి ఒక ఆసక్తికరమైన ప్రశ్న ఎదురయింది.ఈ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తి కాగానే చిరంజీవి తన భార్య సురేఖ తో కలిసి అమెరికా వెళ్లారు. అయితే ఈయన వెకేషన్ కోసం వెళ్లారని అందరూ భావించినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం చిరంజీవి కాలు సర్జరీ  కోసం వెళ్లారని వార్తలు వచ్చాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందనే ప్రశ్న వీరికి ఎదురైంది.
ఈ ప్రశ్నకు తమన్నా సమాధానం చెబుతూ చిరంజీవి గారు ఈ సినిమాలోని ఒక పాట షూటింగ్ చేసే సమయం లో తీవ్రమైన మోకాలి నొప్పి  సమస్య తో బాధపడ్డారు. అయితే ఆయన మాత్రం నొప్పి కారణం గా సినిమా షూటింగ్ వాయిదా వేయలేదు తన నొప్పిని దాచుకొని ఈ పాటకు రిహార్సల్స్ చేసి మరి షూటింగ్ కంప్లీట్ చేశారు. అలాంటి డెడికేషన్, ఫ్యాషన్ ఉన్న వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారని తెలిపింది. తమన్నా వ్యాఖ్యల తో చిరంజీవి భోళాశంకర్ సమయం లో తీవ్రమైన మోకాలి నొప్పితో బాధపడ్డారని తెలుస్తోంది. అయితే తమన్న చేసిన ఈ కామెంట్స్ వైరల్ కావడంతో చిరంజీవి మోకాలు సర్జరీ గురించి వస్తున్నటువంటి వార్తలు నిజమేనని అందరూ భావిస్తున్నారు. చిరంజీవి అమెరికా వెకేషన్ నుంచి వచ్చిన తర్వాత బేబీ సినిమా ఈవెంట్ లో కనిపించిన విషయం తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: