మొదటిరోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో హైయెస్ట్ కలెక్షన్లను వసూలు చేసిన టాప్ 5 టాలీవుడ్ మూవీస్ ఇవే..!

Pulgam Srinivas
ఈ సంవత్సరం ఇప్పటికే తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి అనేక సినిమాలు విడుదల అయ్యాయి. అందులో కొన్ని సినిమాలు మొదటి రోజు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేశాయి. ఇది ఇలా ఉంటే ఈ సంవత్సరం ఇప్పటి వరకు తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల అయిన సినిమాలలో మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అత్యధిక కలెక్షన్ లను వసూలు చేసిన టాప్ 5 మూవీ లు ఏవో తెలుసుకుందాం.

ప్రభాస్ హీరోగా కృతి సనన్ హీరోయిన్ గా రూపొందిన ఆది పురుష్ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 32.84 కోట్ల కలక్షన్ లను వసూలు చేసింది.

బాలకృష్ణ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 25.35 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ... సాయి ధరమ్ తేజ్ లు హీరోలుగా రూపొందిన "బ్రో" మూవీ మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 23.61 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో సాయి తేజ్ సరసన కేతిక శర్మ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకు సముద్ర కని దర్శకత్వం వహించాడు. ఈ మూవీ తాజాగా జూలై 28 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ప్రస్తుతం ఈ సినిమా ధియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది.

మెగాస్టార్ చిరంజీవి తాజాగా వాల్టేరు వీరయ్య అనే మూవీ తో ప్రేక్షకులను పలకరించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 29.90 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ సినిమాకు బాబీ దర్శకత్వం వహించాడు.

నాచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన దసరా సినిమా మొదటి రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో 14.22 కోట్ల కలెక్షన్ లను వసూలు చేసింది. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాలో మహానటి కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: