సూర్య43: సాలిడ్ స్టోరీతో అప్పటినుంచి షూటింగ్ స్టార్ట్?

Purushottham Vinay
తమిళ స్టార్ హీరో సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాడు ఈ హ్యాండ్సమ్ హీరో. సూర్య చివరగా రో్లెక్స్ గెట్ అప్ లో కనిపించి అభిమానులని ఎంతగానో మెప్పించాడు.ఇక త్వరలో భారీ బడ్జెట్ పాన్ వరల్డ్ సినిమా అయిన 'కంగువ'తో ఫ్యాన్స్ ముందుకు రాబోతున్నాడు.ఇక ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ స్టేజ్ లో ఉంది. ఇటీవలే కంగువ గ్లింప్స్ రిలీజ్ చేసి ఆ సినిమాపై అంచనాలు భారీగా పెంచేశారు.అందువల్ల ఈ సినిమా కోసం సూర్య అభిమానులు చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇక కంగువ సినిమా తర్వాత సూర్య 43వ సినిమా గురించి ఎప్పట్నుంచో ఎన్నో రకాల వార్తలు వస్తున్నాయి.తాజాగా సూర్య 43వ సినిమా గురించి ఓ క్లారిటీ వచ్చింది. సూర్యకి ఆకాశం నీ హద్దురా లాంటి రెస్పెక్టబుల్ బ్లాక్ బస్టర్ మూవీని ఇచ్చిన డైనమిక్ లేడీ డైరెక్టర్ సుధా కొంగర డైరెక్షన్ లోనే సూర్య 43వ సినిమా ఉండబోతుందని కంఫర్మ్ అయ్యింది.



ఈ మూవీలో మలయాళం స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ కూడా ఓ ముఖ్య పాత్ర చేయనున్నట్టు సమాచారం తెలుస్తుంది. అందువల్ల సోషల్ మీడియాలో సూర్య 43 బాగా ట్రెండింగ్ లో ఉంది. ఫస్ట్ ఈ పాత్రని సూర్య తమ్ముడు కార్తితో చేయించాలని అనుకున్నా తర్వాత దుల్కర్ ని తీసుకున్నట్టు సమాచారం తెలుస్తుంది.ఈ సినిమాని హోంబలే ఫిలిమ్స్ ఇంకా 2D ఎంటర్టైన్మెంట్స్ సంయుక్తంగా చాలా నిర్మిస్తారని సమాచారం తెలుస్తుంది.ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే ఇదొక హై బడ్జెట్ తో తెరకెక్కుతున్న పాతకాలపు గ్యాంగ్ స్టర్ డ్రామా అని సమాచారం తెలుస్తుంది. ఇక ఈ సినిమా షూటింగ్ విషయానికి వస్తే 2023 డిసెంబర్ నెల నుంచి స్టార్ట్ కాబోతున్నట్లు సమాచారం తెలుస్తుంది. మరి రెండోసారి వీరి కాంబినేషన్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: