తాజాగా టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన "బ్రో" సినిమా జులై 28 న రిలీజ్ అయి మిశ్రమ స్పందన తెచ్చుకున్న సంగతి తెలిసిందే.అయితే ఈ సినిమా రిలీజ్ కి ముందు బ్రో పై సినిమా పరంగా ఇంకా రాజకీయపరంగా ఎన్నో అడ్డంకులు ఎదురైన సంగతి తెలిసిందే. ఎందుకంటే ఈ బ్రో సినిమా ఒక రీమేక్ అని, పవన్ కళ్యాణ్ రొట్ట రొటీన్ సినిమా తీస్తున్నారని, పైగా ఈ సినిమా పాటలు కూడా బాగా లేవని ఇలా చాలా రకాల ట్రోలింగ్స్ అనేవి చేసారు. ఇంకా ఇవే గాక రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ కి గతంలో కూడా వకీల్ సాబ్, భీమ్లా నాయక్ సినిమాలు రిలీజ్ టైమ్ లో అడ్డుకోడానికి ఎంత ట్రై చేసారో అందరికీ తెలిసిందే.అయితే ఈ సినిమాకి అలాంటి అసలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నిర్మాతలు ముందుగానే తగిన జాగ్రత్త తీసుకున్నారు. అందుకే "బ్రో" సినిమాని తక్కువ రేట్లకే డిస్ట్రిబ్యూటర్లకు విక్రయించగా,ఈ సినిమా టికెట్ హైక్ కూడా పెంచకుండా సాధారణ రేట్లకే నిర్ణయించడం జరిగింది. అదీ గాక ఈ సినిమాకి బెనిఫిట్ షో లు కూడా వెయ్యలేదు.ఇలా ఇన్ని రకాల సమస్యల మధ్య రిలీజ్ అయిన బ్రో డీసెంట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ భారీ ఓపెనింగ్స్ తో మాత్రం కుమ్మేసింది.
మార్నింగ్ షో లలో అక్కడక్కడా కొంచెం లిమిటెడ్ ఫుల్స్ అయినా, ఈవెనింగ్ షోస్ వచ్చేసరికి ఒక్క టికెట్ ముక్క మిగల్లేదు.ఇక ఫస్ట్ డే బ్రో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 23.61 కోట్ల షేర్, అలాగే, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా కలిపి 2.20కోట్ల షేర్, ఓవర్సీస్ లో 4.40 కోట్ల షేర్, ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 30.20 కోట్ల షేర్, ఓవరాల్ గా 49 కోట్ల గ్రాస్ ని రాబట్టింది. ఇక పవన్ కళ్యాణ్ గత నాలుగు సినిమాల ఓపెనింగ్స్ విషయానికి వస్తే..అజ్ఞాతవాసి 61 కోట్లు, వకీల్ సాబ్ 54 కోట్లు, భీంలా నాయక్ 57 కోట్లు, బ్రో 49 కోట్లు వసూళ్లు రాబట్టాయి. ఇక పవన్ తరువాత సినిమా OG కి కూడా ap లో భారీ రైట్స్ పలుకుతున్నాయి. ఈ బ్రో సినిమాకి పవన్ కళ్యాణ్ గత సినిమాల కన్నా కొంచెం తక్కువ ఓపెనింగ్సే వచ్చినప్పటికీ, ఇన్ని రకాల ఇబ్బందుల్లో కూడా ఈ రేంజ్ ఓపెనింగ్స్ అంటే అది మామూలు విషయం కాదు. అది ఓన్లీ పవన్ కళ్యాణ్ సినిమా కాబట్టే ఈ క్రేజ్ అని చెప్పవచ్చు. ఇక బ్రో సినిమా రిలీజ్ తర్వాత కూడా కొందరు ప్రముఖ రాజకీయ నేతలు సినిమాలో ప్రముఖ రాజకీయ నేతని అవమానించారని కూడా అనేక రకాల కామెంట్స్ చేస్తున్నారు.