"బేబీ" మూవీ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ కు ముఖ్య అతిథిగా ఆ స్టార్ హీరో..!

Pulgam Srinivas
ఈ నెల పెద్దగా ఎలాంటి అంచనాలు లేకుండా విడుదల అయ్యి బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం సాధించినటువంటి బేబీ మూవీ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ ... వీరాజ్ ... వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రలలో నటించగా ... ఈ సినిమాకు హృదయ కాలేయం ... కొబ్బరి మట్ట సినిమాలకు దర్శకత్వం వహించినటు వంటి సాయి రాజేష్ దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ఈ నెల 14 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఈ మూవీవిడుదల అయిన మొదటి రోజే బాక్స్ ఆఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ ను తెచ్చుకోవడంతో ఈ మూవీ కి మొదటి రోజు తర్వాత నుండి కలెక్షన్ లు కొద్ది కొద్దిగా పెరుగుతూ వచ్చాయి.


దానితో ఈ మూవీ చాలా తక్కువ రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ ఫార్ములా ను కంప్లీట్ చేసుకుని లాభాలను అందుకోవడం మొదలు పెట్టింది. దానితో ఈ మూవీ కి ఇప్పటికే భారీ మొత్తంలో లాభాలు వచ్చాయి. ఇప్పటికి కూడా ఈ సినిమా సూపర్ సక్సెస్ ఫుల్ గా కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబడుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ ఇప్పటికే బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ మూవీ మేకర్స్ మెగా కల్ట్ సెలబ్రేషన్స్ పేరుతో ఓ భారీ  ఈవెంట్ ను నిర్వహించడానికి సిద్ధం అయ్యారు. అందులో భాగంగా అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా ఈ మూవీ మేకర్స్ తాజాగా విడుదల చేశారు.


ఈ మూవీ బ్లాక్ బాస్టర్ ఆయన సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి ని ఈ మూవీ బృందం ముఖ్య అతిథిగా తీసుకురానున్నారు. ఈ విషయాన్ని తాజాగా ఈ మూవీ బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ సినిమా యొక్క మెగా కల్ట్ సెలబ్రేషన్స్ ను ఈ రోజు సాయంత్రం 6 గంటలకు నిర్వహించబోతున్నారు. ఇకపోతే ఈ మూవీ ద్వారా ఆనంద్ దేవరకొండ ... విరాజ్ ... వైష్ణవి చైతన్య ... సాయి రాజేష్ లకు మంచి గుర్తింపు లభించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: