టాలీవుడ్
యువ హీరో
నాగ శౌర్య తాజాగా రంగబలి అనే పవర్ఫుల్
మాస్ యాక్షన్
మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమాకు పవన్ బాసంసెట్టి దర్శకత్వం వహించాడు. ఈ
సినిమా విడుదలకు ముందు ఈ
మూవీ నుండి ఈ
మూవీ మేకర్స్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాయి. దానితో ఈ
మూవీ పై తెలుగు సినీ ప్రేమికులు పర్వాలేదు అనే రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారు. అలా పర్వాలేదు అనే రేంజ్ అంచనాల నడుమ
థియేటర్ లలో విడుదల అయిన ఈ
సినిమా విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే
బాక్స్ ఆఫీస్ దగ్గర మిక్స్ డ్ టాక్ ను తెచ్చుకుంది. దానితో ఈ సినిమాకు
బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్ లు దక్కలేదు. దానితో చివరకు ఈ
సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్
మూవీ గా మిగిలిపోయింది. ఇలా
బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను పెద్దగా ఆకట్టు కోలేక పోయిన ఈ
సినిమా మరికొన్ని రోజుల్లో "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుంది.
తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడింది. ఈ
మూవీ యొక్క "ఓ టి టి" హక్కులను ప్రముఖ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లలో ఒకటి అయినటువంటి
నెట్ ఫ్లిక్స్ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను ఆగస్టు 4 వ తేదీ నుండి
నెట్ ఫ్లిక్స్ "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు ఈ సంస్థ తాజాగా అధికారికంగా ప్రకటించింది. మరి
బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను నిరాశ పరిచిన ఈ
సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.
సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాకు పవన్ సిహెచ్ సంగీతం అందించాడు.