తెలుగు చదవడం రాని.. తెలుగు హీరోలు వీళ్ళే?

praveen
ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ అన్న అపోహ ప్రపంచమంతటా ఉంది. కానీ ఆ అపోహలను ఇప్పుడు చెరిపేస్తూ ఇండియన్ సినిమా అంటే బాలీవుడ్ మాత్రమే కాదు అని చెప్పి మనకంటూ ప్రపంచ స్థాయిలో మంచి గుర్తింపు తెస్తోంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. మన దేశంలోనే కాకుండా ప్రపంచస్థాయిలో అనేక విజయాలు సాధిస్తోంది మన ఫిలిం ఇండస్ట్రీ. మన సినిమాల గురించి కామిక్ కాన్ వంటి అంతర్జాతీయయ వేదికలపై చర్చించుకుంటున్నారు అంటే మన టాలీవుడ్ ఏ స్థాయికి ఎదిగింది అర్ధమవుతోంది.
ఇతర ప్రాంతాలు, భాషల నటులు మన టాలీవుడ్లో సినిమాలు చేయడం కొత్తేమి కాదు. ముఖ్యంగా హీరోయిన్లు ఎక్కువగా ఇతర ప్రాంతాలనుంచి వస్తుంటారు. వాళ్లకు మన భాష రాకపోయినా పెద్ద సమస్యేమీ కాదు. కానీ ఇక్కడే పుట్టి, పెరిగి, తమ సినీ ప్రస్థానాన్ని ప్రారంభించడమే కాకుండా, స్టార్లుగా ఎదిగిన మన తెలుగు నటులు కొందరికి తెలుగు రాదు. ఇది నిజంగా మనం చింతించాల్సిన విషయం.  అలాంటి నటులు ఎవరో ఇప్పుడు మనం తెలుసుకుందాం.
అక్కినేని నాగార్జున... తెలుగు సినిమా ఖ్యాతిని ఒక మెట్టు ఎక్కించిన ఆక్కినేని నాగేశ్వరరావు గారి తనయుడిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టినా.. అతి తక్కువ కాలంలోనే తన టాలెంట్ తో తనదంటూ ఒక ముద్ర వేశారు నాగార్జున. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో అక్కినేని ఫామిలీకి ఒక ఇమేజ్ను ఏర్పరిచారు ఈ యువ సామ్రాట్. తెలుగులో వందకు పైగా చిత్రాలలో నటించిన ఈయనకు తెలుగు చదవడం కానీ, రాయడం కానీ రాదట. సినిమా షూటింగ్లలో డైలాగులు ఇంగ్లీషులో రాసుకొని చదివి అర్ధం చేసుకుంటారట.
మహేష్ బాబు... ఈయన టాలీవుడ్ టాప్ హీరోలలో ఒకడు. చైల్డ్ ఆర్టిస్టుగా తన సినీ ప్రస్థానాన్ని మొదలుపెట్టిన మహేష్ ప్రస్తుతం కొన్నేళ్లుగా అపజయం లేకుండా వరుస విజయాలతో జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నాడు. పోకిరి, మహర్షి, మురారి వంటి సూపర్ డూపర్ హిట్స్ ఇచ్చిన మన సూపర్ స్టార్ కి కూడా తెలుగు చదవటం రాయటం రాదట. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా బయటపెట్టారు.
మంచు లక్ష్మి .. ఈమె మన డైలాగ్ కింగ్ మంచు మోహన్ బాబు గారి కూతురు. ఈమె ఆన్ స్క్రీన్ కాకుండా ఆఫ్ స్క్రీన్ ఎక్కువగా వైరల్ అవుతూవుంటుంది. మంచు లక్ష్మి నటిగా, హోస్టుగా, నిర్మాతగా తెలుగు ఇండస్ట్రీలో మంచి స్థానాన్ని ఏర్పరుచుకున్నారు. కానీ మంచు లక్ష్మికి కూడా ఒక్క ముక్క తెలుగు కూడా రాదట. ఆమెతో పాటు ఆమె అన్న మంచు విష్ణుది కూడా ఇదే పరిస్థితి. మొన్నామధ్య ఆయన ఒక ఇంటర్వ్యూలో టంగుటూరి ప్రకాశం ఫంతులు అంటూ పరువు పోగుట్టుకున్న విషయం అందరికి తెలిసిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: