పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, యుంగ్ హీరో సాయి ధరమ్ కీలక పాత్రధారులుగా తెరకెక్కిన సినిమా బ్రో ది అవతార్.తమిళంలో తెరకెక్కి సూపర్ హిట్ గా నిలిచిన వినోదయ సిత్తం అనే సినిమాను తెలుగు నేటివిటీకి తగినట్టు మార్పులు చేసి రీమేక్ చేసారు.అక్కడ డైరెక్ట్ చేసిన సముద్రఖని ఈ సినిమాను ఇక్కడ కూడా తెరకెక్కించగా త్రివిక్రమ్ మాత్రం తన మార్క్ డైలాగ్స్, స్క్రీన్ ప్లే తో అభిమానులని అలరించనున్నాడు. ఇక స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ ఎస్ఎస్ థమన్ సంగీతం అందించిన ఈ సినిమాలో సాంగ్స్ అయితే ఇప్పటికీ మంచి హిట్ టాక్ కూడా తెచ్చుకున్నాయి. ఇక ఎట్టకేలకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయింది. జూలై 28 అంటే మరికొద్ది గంటల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే అమెరికాలో ప్రీమియర్లు కూడా పడ్డాయని అక్కడి అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఏకంగా 700 k డాలర్స్ ప్రీ సేల్స్ అయ్యాయని సమాచారం తెలుస్తుంది. ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు మాత్రం ఒక రేంజ్ లో కురుస్తున్నాయి.
ముఖ్యంగా తెలంగాణలో అయితే కొన్ని ప్రాంతాల్లో వాగులు, వంకలు పొంగి చాలా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఇక ఇదిలా ఉండగా ఇంత వర్షంలో కూడా చాలా చోట్ల సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ ఒక రేంజ్ లో దుమ్ము రేపుతున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు నైజాం ఏరియాలో హైదరాబాద్ సహా కొన్ని ప్రాంతాల్లో ఈ బుకింగ్స్ చాలా గట్టిగానే జరుగుతున్నాయి అని సమాచారం తెలుస్తోంది. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించగా ప్రియా ప్రకాష్ వారియర్, కేతిక శర్మ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకున్న బ్రో అడ్వాన్స్ బుకింగ్స్ లో మాత్రం రచ్చ చేస్తుంది. అయితే ట్రేడ్ వర్గాల వారి అంచనాలు ప్రకారం బుకింగ్స్ బాగా జోరుగా ఉన్నప్పటికీ పవన్ కళ్యాణ్ గత సినిమాలతో పోలిస్తే కాస్త స్లోగా ఉన్నాయని సమాచారం తెలుస్తుంది. అయినా అదేమీ సినిమాకి పెద్ద ఎఫెక్ట్ కాదని అంటున్నారు.