క్యూట్ లుక్స్ తో మైమరపిస్తున్న మోస్ట్ బ్యూటిఫుల్ నటి..!

Pulgam Srinivas
మోస్ట్ బ్యూటిఫుల్ ... మోస్ట్ టాలెంటెడ్ నటిమని శ్రీ లీల గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. శ్రీ లీల ... రోషన్ హీరోగా రూపొందిన పెళ్లి సందD అనే సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ లో ఈ ముద్దు గుమ్మ తన నటనతో ... అందచందాలతో ... డ్యాన్స్ తో ప్రేక్షకులను కట్టి పడేసింది. దానితో ఈ నటికి వరుసగా టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమాలలో అవకాశాలు దక్కుతున్నాయి. అందులో భాగంగా ఇప్పటికే ఈ నటి పోయిన సంవత్సరం చివరన విడుదల అయిన ధమాకా మూవీ తో అద్భుతమైన విజయాన్ని బాక్స్ ఆఫీస్ దగ్గర సొంతం చేసుకుంది.
 


ఇకపోతే ప్రస్తుతం ఈ నటి చేతుల్లో అరడజనుకు పైగా సినిమాలు ఉన్నాయి. అందులో ఈ ముద్దుగుమ్మ చేతిలో కొన్ని భారీ క్రేజీ సినిమాలు కూడా ఉన్నాయి. ఈ ముద్దుగుమ్మ చేతిలో ఉన్న భారీ క్రేజ్ సినిమాలు గుంటూరు కారం ... ఉస్తాద్ భగత్ సింగ్.  గుంటూరు కారం సినిమాలో ఈ ముద్దు గుమ్మ మహేష్ కి జోడిగా నటిస్తూ ఉండగా ... ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ లో ఈ నటి పవన్ సరసన హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ఈ రెండు క్రేజీ మూవీ లతో పాటు ఈ ముద్దు గుమ్మ నితిన్ తో ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్ ... రామ్ పోతినేని తో స్కంద ... పంజా వైష్ణవ్ తేజ్ తో ఆది కేశవ మరియు మరికొన్ని సినిమాలలో కూడా శ్రీ లీల హీరోయిన్ గా నటిస్తోంది.


ఇలా వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్న శ్రీ లీల అప్పుడప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తూ వస్తుంది. అందులో భాగంగా తాజాగా ఈ నటి తన సోషల్ మీడియా అకౌంట్ లో కొన్ని ఫోటోలను పోస్ట్ చేసింది. అందులో ఈ ముద్దుగుమ్మ డిఫరెంట్ లుక్ ఉన్న డ్రెస్ ను వేసుకొని చాలా క్యూట్ లుక్స్ తో ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం శ్రీ లీల కు సంబంధించిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: