సమంత ఆధ్యాత్మికతలో ఎంటర్ టైన్మెంట్ !
వెనువెంటనే అక్కడితో ఆగకుండా ఇండోనేషియా లోని బాలి కి వెళ్ళి అక్కడ అందమైన ప్రకృతిని సముద్రాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రస్తుతం ఆమె కాలం గడుపుతోంది. ఆ ఆహ్లాదకర వాతావరణం తనకు ఎంతో మానసిక శాంతిని కలిగించింది అని చెపుతూ అక్కడ ప్రకృతిని ఎంజాయ్ చేస్తూ కాలం గడుపుతున్న ఫోటోలను ఆమె తన సోషల్ మీడియా ఎకౌంట్ లో షేర్ చేసింది.
అంతేకాదు అక్కడ తాను తింటున్న ప్రత్యేకమైన ఫుడ్ ను చేస్తున్న ధ్యానానికి సంబంధించిన వివరాలను కూడ తన అభిమానులకు షేర్ చేసింది. అయితే ఇండోనేషియాలోని బాలి లో సమంత ఉంటున్న కాటేజీకి తరుచూ కోతులు అతిధులగా వస్తున్నాయట. అంతేకాదు ఈమధ్య సమంత పెట్టుకునే కళ్లజోడును ఆ కోతులు ముచ్చటపడి తీసుకు వెళ్లిపోయాయట ఈవిషయాన్ని కూడ సమంత తన అభిమానులకు షేర్ చేసింది. కొంతకాలం ప్రశాంతమైన వాతావరణంలో ధ్యానం చేసిన తరువాత తన వ్యాధికి సంబంధించి మరింత మెరుగైన వైద్యం కోసం ఆమె అమెరికా వెళ్లబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సమంత విజయ్ దేవరకొండతో కలిసి నటించిన ‘ఖుషీ’ మూవీ విడుదలకు రెడీ అవుతోంది. ఈమూవీ తనకు మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆమె ఆశిస్తోంది. ఎంతో కష్టపడి నటించిన ‘శాకుంతలం’ ఫలితం నిరాశపరచడంతో సమంత ఈ మూవీ పై చాల ఆశలు పెట్టుకుంది. అంచనాలకు అనుగుణంగా ఈ సినిమా హిట్ అయి ఆమె ఆరోగ్యం కూడ చక్కపడితే ఆమెకు మళ్ళీ టాలీవుడ్ లో మంచి అవకాశాలు కూడ వచ్చే ఆస్కారం ఉంది..