ఆ షో పై షాకింగ్ కామెంట్స్ చేసిన సరయు...!!

murali krishna
బిగ్ బాస్ షో విషయం లో ప్రేక్షకుల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఈ షోకు హాజరైన సెలబ్రిటీలు సైతం ఈ షో గురించి వేర్వేరు కామెంట్లు చేశారు.తాజాగా బిగ్ బాస్ షో కంటెస్టెంట్ సరయు ఈ షో ఫేక్ షో అంటూ ఒక ఇంటర్వ్యూలో షాకింగ్ కామెంట్లు చేయగా ఆ కామెంట్లు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అవుతున్నాయి. సరయు మాట్లాడుతూ ఈ రియాలిటీ షోలు అన్నీ ఫేక్ అని కామెంట్లు చేశారు.

కొనుక్కోవడం లేదా తిరిగి వాళ్లకు డబ్బులు ఇవ్వడం ద్వారా మనకు సంబంధించిన వాళ్లను ముందుకు తీసుకెళ్లే ఫ్లాట్ ఫామ్స్ రియాలిటీ షోలు అని సరయు చెప్పుకొచ్చారు. ఈ రియాలిటీ షోల ద్వారా మిమ్మల్ని, మమ్మల్ని జనాలను పిచ్చోళ్ల ను చేస్తున్నరని ఆమె కామెంట్లు చేశారు. దయచేసి ఇలాంటి రియాలిటీ షోలు చూడవద్దని మీ సమయం వృథా చేసుకోవద్దని సరయు అభిప్రాయం వ్యక్తం చేశారు.నేను బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ ను కాబట్టే ఈ విషయాలు చెబుతున్నానని సరయు అన్నారు. బిగ్ బాస్ షో కు వెళ్లిన సమయం లో నాకేం తెలియదని ఆమె అన్నారు. జాబ్ చేశామా? ఇంటికొచ్చామా? యూట్యూబ్ వీడియోలు చేస్తున్నామా? ఇది మాత్రమే నా ఆలోచన అని సరయు అన్నారు. బిగ్ బాస్ షో లో ఉన్న కంటెస్టెంట్లకు బయటినుంచి సపోర్ట్ లభించడం తో పాటు లోపలినుంచి కూడా లభించేదని ఆమె అన్నారు.

బిగ్ బాస్ హౌస్ లో ఉన్న అలాంటి కంటెస్టెంట్ల కాన్ఫిడెన్స్ వేరే లెవెల్ లో ఉండేదని సరయు చెప్పు కొచ్చారు. అలాంటి వాళ్ల తో పోరాడటం సులువు కాదని వాళ్ల తో పోరాడితే నెగిటివ్ అయ్యేది మనమేనని సరయు వెల్లడించారు. ఆ సమయంలో తాను ఒత్తిడికి గురయ్యేదానినని సరయు చెప్పుకొచ్చారు. సరయు చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: