అల్లు హీరోతో జతకట్టబోతున్న బేబీ బ్యూటీ...!!

murali krishna
బేబీ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వైష్ణవి చైతన్య పేరు ఇండస్ట్రీలో మార్మోగిపోతుంది. వైష్ణవి చైతన్య ఇదివరకు పలు వెబ్ సిరీస్లలో నటిస్తూ యూట్యూబర్ గా ఎంతో మంచి గుర్తింపు పొందారు.అయితే ఈమె బేబీ సినిమాలో నటించే అవకాశాన్ని అందుకున్నారు.ఇలా బేబీ సినిమా ద్వారా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి వైష్ణవి చైతన్యకు ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుసగా అవకాశాలు వస్తున్నాయని తెలుస్తుంది. అయితే ఈమె తదుపరి ప్రాజెక్ట్ మాత్రం ప్రముఖ నిర్మాణ సంస్థ అయినటువంటి గీత ఆర్ట్స్ బ్యానర్లో అవకాశమందుకుందని సమాచారం.

గీత ఆర్ట్స్ బ్యానర్ లో తనకు అవకాశం కల్పించాలని నిర్మాత అల్లు అరవింద్ భావించారట. ఆయన స్వయంగా వైష్ణవి చైతన్య పేరును సజెస్ట్ చేయడంతో ఈమె లక్కీ ఛాన్స్ కొట్టేసిందని తెలుస్తుంది. గీత ఆర్ట్స్ బ్యానర్ లో అల్లు శిరీష్ తో కలిసి ఓ సినిమా చేయాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారట. అన్ని కుదిరితే అల్లు శిరీష్ కి జోడిగా వైష్ణవి చైతన్యను తీసుకోవాలని ఈయన భావించినట్లు తెలుస్తోంది. అయితే ఈమె గీత ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా చేయడం కోసం ఇప్పటికే అగ్రిమెంట్ పై సైన్ కూడా చేశారని తెలుస్తోంది. ఇక అల్లు శిరీష్ హీరోగా కథ ఫైనల్ అయితే వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రాబోతుందని సమాచారం.

ఇలా ఒక యూట్యూబర్ గా పలు వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేసినటువంటి వైష్ణవి చైతన్య సినిమా అవకాశాలను అందుకుని మొదటి సినిమాని 50 కోట్ల కలెక్షన్లతో అద్భుతమైన విజయాన్ని అందుకుంది.ఈ విధంగా మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమెకు టాలీవుడ్ లో వరుస అవకాశాలు వస్తున్నాయని సమాచారం. ఏది ఏమైనా వైష్ణవి చైతన్య క్రేజ్ మాత్రం బేబీ సినిమాతో అమాంతం పెరిగిపోయిందని చెప్పాలి.సాయి రాజేష్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఆనంద్ దేవరకొండ హీరోగా నటించిన వైష్ణవి చైతన్య హీరోయిన్ గా నటించి మంచి సక్సెస్ అందుకున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: