
వీకెండ్ లో బికినీతో ట్రీట్ ఇస్తున్న అనన్య...!!
గత ఏడాది అనన్య పాండే నటించిన గెహరియాన్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అయ్యింది. ఇంటెన్స్, రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కిన గెహరియాన్ మూవీలో దీపికా పదుకొనె మెయిన్ లీడ్ చేశారు. అనన్య పాండే మరో కీలక రోల్ చేయడం జరిగింది. ఈ సినిమా కోసం కొంచెం హద్దులు మీరి రొమాన్స్ కురిపించారు దీపికా, అనన్య పాండే.నటుడు చంకీ పాండే కూతురైన అనన్య పాండే 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. టైగర్ ష్రాఫ్ హీరోగా తెరకెక్కిన ఈ మూవీ హిట్ టాక్ తెచ్చుకుంది. దర్శకుడు పునీత్ మల్హోత్రా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని దర్శక నిర్మాత కరణ్ జోహార్ నిర్మించారు.
అనంతరం, పతి పత్ని ఔర్ ఓహ్, కాలీ పీలీ చిత్రాలు చేశారు. ఇప్పుడిప్పుడే అనన్య బాలీవుడ్ లో నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం ఆమె హీరోయిన్ గా 'కో గయే హమ్ కహన్' డ్రీం గర్ల్ 2, కంట్రోల్ చిత్రాల్లో నటిస్తున్నారు. అలాగే రాఖీ ఔర్ రాణి ప్రేమ్ కహాని మూవీలో క్యామియో రోల్ చేస్తున్నారు.అనన్య పాండేకు ఇంకా బ్రేక్ రాలేదు. బాగా సన్నగా ఉండే అనన్య పాండే బాడీ షేమింగ్ కి గురైనట్లు గతంలో వెల్లడించారు. తనను ఫ్లాట్ చెస్ట్ అంటూ కించపరిచారని అనన్య వేదన చెందారు. 24 ఏళ్ల అనన్యకు చాలా భవిష్యత్తు ఉంది.