ఆధ్యాత్మిక ప్రయాణం మొదలుపెట్టిన సమంత !

Seetha Sailaja
మయోసైటీస్ అనే వ్యాధితో బాధపడుతున్న సమంత పరిస్థితులతో యుద్ధం చేస్తూ తిరిగి తన టాప్ హీరోయిన్ స్థానాన్ని చేజిక్కించుకోవాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తోంది. అయితే పరిస్థితులు ఇంకా ఆమెకు పూర్తిగా సహకరించడంలేదు. ‘శాకుంతలం’ మూవీ ఫెయిల్ అయినప్పటికీ తన మనోనిబ్బరాన్ని కోల్పోకుండా విజయ్ దేవరకొండతో నటిస్తున్న ‘ఖుషీ’ మూవీని పూర్తి చేసింది.


వాస్తవానికి ఆమెకు మరికొన్ని ఆఫర్స్ వస్తున్న నేపధ్యంలో ఆమె మళ్ళీ హీరోయిన్ గా బిజీ అవుతుందని ఆమె అభిమానులు ఆశించారు. అయితే ఆమె వ్యాధి మళ్ళీ తిరగ పెట్టడంతో ఆమె ఇక లాభం లేదనుకుని కొంతకాలం పాటు సినిమాలకు బ్రేక్ ఇచ్చి అమెరికా వెళ్ళి అక్కడ మెరుగైన వైద్యం చేయించుకోవాలని భావించింది. ఈలోపు ఆమె జగ్గీ వాసుదేవ్ నిర్వహించే ఇషా ఫౌండేషన్ లో అడ్వాన్స్డ్ యోగా క్లాసులలో ప్రత్యక్షమైంది.

దీనికి సంబంధించిన ఒక ఫోటోను ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసింది. అంతేకాదు అమెరికా వెళ్ళేలోపు తమిళనాడు లోని ముఖ్యమైన ఆలయాలు అన్నీ దర్శించుకుని అక్కడి భగవంతుడి ఆశీర్వాదాలు ఆమె తీసుకుందామని కూడ సమంత ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. గతంలో నాగచైతన్య నుండి ఆమె వీడిపోయిన తరువాత ఆ షాక్ నుండి ఆమె తెరుకోవడానికి సమంత ఇలాగే తీర్థయాత్రలు చేసింది.


ఆతరువాత ఆమె తన కెరియర్ లో మళ్ళీ టాప్ పొజిషన్ కు చేరుకుందామని ప్రయత్నిస్తూ ఉంటే తిరిగి ఆమె అనారోగ్యం తిరగ పెట్టడంతో ఆమె ఒక సూపర్ పవర్ సపోర్ట్ కోసం ప్రయత్నిస్తూ ఇలా ఆధ్యాత్మిక ప్రయాణం మళ్ళీ మొదలుపెట్టింది అనుకోవాలి ఇప్పటికే చాలామంది యంగ్ హీరోయిన్స్ ఇండస్ట్రీలో తమ సత్తా చాటుతున్న పరిస్థితులలో అనారోగ్య కారణాల రీత్యా ఒక ఏడాది సమయం గ్యాప్ అంటే హీరోయిన్స్ కెరియర్ విషయంలో చాల ఎక్కువ సమయం ఇలాంటి పరిస్థితులలో తిరిగి ఆరోగ్యం చేకూరి సమంత ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ ఆమెకు ఎంతవరకు అవకాశాలు వస్తాయి అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్..  


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: