ఆ విషయంలో ఒత్తిడి పెంచుతున్నారంటున్న విజయ్ వర్మ...!!

murali krishna
బాలీవుడ్ నటుడు విజయ్ వర్మ ప్రేమ లో తమన్నా మునిగి తేలుతున్నారు. విజయ్ వర్మ బాలీవుడ్ ఇండస్ట్రీ లో నటుడి గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు.ఈ క్రమం లోనే ఈయన తమన్నాతో కలిసి లస్ట్ స్టోరీస్ 2 ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సిరీస్ షూటింగ్ సమయం లోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని వీరి ప్రేమ విషయాన్ని బహిరంగంగా తెలియజేశారు. అయితే చాలామంది ఈ సిరీస్ ప్రమోషన్ల కోసమే వీరు ఇలా చెప్పారు అంటూ కూడా వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై స్పందించినటువంటి విజయ్ వర్మ తాను తమన్నతో ప్రేమలో ఉన్నానని ఇద్దరం పీకల్లోతు ప్రేమలో మునిగిపోయి ప్రేమించుకుంటున్నామని తెలిపారు.

ఇక తమన్నా నా జీవితంలోకి రాకముందు తన జీవితం విలన్ దశగానే ఉండేదని, అయితే తను నా జీవితంలోకి వచ్చిన తర్వాత విలన్ దశ నుంచి రొమాంటిక్ దశలోకి అడుగు పెట్టానని తెలిపారు.ఇకపోతే తమన్నాను పెళ్లి చేసుకోవాలని విజయ్ వర్మ కుటుంబ సభ్యుల నుంచి ఒత్తిడి ఎక్కువైనట్టు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై విజయ్ వర్మ స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఈ సందర్భంగా విజయ్ వర్మ మాట్లాడుతూ నా జీవితంలో పెళ్లి ఒత్తిడి ఎప్పుడో ప్రారంభమైందని తెలిపారు.నేను మార్వాడి అబ్బాయిని మా కమ్యూనిటీలో అబ్బాయిలకు 16 సంవత్సరాల వయసు రాగానే పెళ్లి వయసుగా పరిగణిస్తారు.

అందుకే ఇవన్నీ నా జీవితంలో ఎప్పుడో ప్రారంభమయ్యాయి.గత కొన్ని సంవత్సరాల నుంచి నా పెళ్లి పై వస్తున్నటువంటి ఒత్తిడి తగ్గింది. అందుకు గల కారణం నేను పెళ్లి చేసుకునే వయసు ఎప్పుడు దాటిపోయింది. అలాగే తాను సినిమాలలో ఉండటం వల్ల ఒత్తిడి కాస్త తగ్గిందని ఈయన తెలిపారు. ఇక విజయ్ వర్మ మాటలను బట్టి చూస్తుంటే త్వరలోనే తమన్నతో ఈయన కూడా పెళ్లి పీటలు ఎక్కబోతున్నారని తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: