ఆ సినిమాతో రీ ఎంట్రీ ఇవ్వబోతున్న లయ...!!
పెళ్లి తర్వాత భర్త, పిల్లల్ని చూసుకుంటూ అక్కడ ఐటీ జాబ్ చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తుంది. అయితే సోషల్ మీడియా ప్రభావం తన మీద కూడా ఎక్కువగా ఉండటంతో ఇక తను కూడా ఇంస్టాగ్రామ్ లో బాగా యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది. ప్రతిరోజు తన డాన్స్ వీడియోలు షేర్ చేసుకుంటూ ఉంటుంది.తన ఫ్రెండ్స్ గ్యాంగ్ తో కలిసి బాగా డాన్సులు చేస్తూ అందర్నీ ఆకట్టుకుంటూ ఉంటుంది.సినిమాలకు దూరంగా ఉంటున్నా కూడా సోషల్ మీడియా ద్వారా తెలుగు ప్రేక్షకులకు టచ్ లో ఉంటుంది. ఇక తన నుండి ఏ వీడియో వచ్చినా కూడా తన తెలుగు అభిమానులు వెంటనే వైరల్ చేసేస్తూ ఉంటారు. తన ఫాలోవర్స్ తనకు కామెంట్స్ పెడితే వెంటనే వారికి రిప్లై ఇస్తూ ఉంటుంది లయ. ఎంతమందికైనా సరే ఓపికగా రిప్లై ఇస్తూ ఉంటుంది.లయ ఒకప్పుడు ఎలా ఉందో ఇప్పుడు కూడా అలాగే ఉంది.
ఎప్పుడు కూడా నిండు బట్టలతో ట్రెడిషనల్ లుక్ లో కనిపిస్తూ ఉంటుంది. ఇక ఆ మధ్య ఇండియాకి వచ్చి వరుస ఇంటర్వ్యూలలో కూడా పాల్గొంది. తన ఫ్యామిలీ గురించి చాలా విషయాలు పంచుకుంది. తన భర్త డాక్టర్ అని తమకు రెండు మూడు హాస్పిటల్స్ ఉన్నాయని..ఇక తను ఖాళీగా ఉండకుండా ఐటీ జాబ్ చేస్తున్నాను అని తెలిపింది. అయితే ఈమె వీడియోస్ పంచుకున్న ప్రతిసారి ఈ మా అభిమానులు టాలీవుడ్ కు రీఎంట్రీ ఇవ్వమని తెగ అడిగేస్తూ ఉంటారు.ఇప్పుడు వారికి తన రీఎంట్రీ కోరిక తీరుతున్నట్లే అని చెప్పవచ్చు. ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబు సనా లయ కు ఫోన్ చేసి తమ సినిమాలో చెయ్యమని రిక్వెస్ట్ చేశాడట. ఇక లయ కాదు అన్న కూడా బలవంతంగా తన సినిమాలోకి తీసుకున్నట్లు తెలిసింది.ప్రస్తుతం ఆయన రామ్ చరణ్ తో స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో లయను తీసుకోగా తనకు హీరోయిన్ క్యారెక్టర్ కాకుండా, తల్లి క్యారెక్టర్ కాకుండా సినిమాని మలుపు తీస్తే క్యారెక్టర్ లో చూపించబోతున్నాడట డైరెక్టర్. ప్రస్తుతం ఈ విషయం తెలియడంతో తన అభిమానులు ఈ సినిమా అప్డేట్ కోసం తెగ ఎదురు చూస్తున్నారు.