తెలంగాణ కోడలిగా తమన్న.. అదెలా అంటే?

praveen
గత కొంతకాల నుంచి మిల్కీ బ్యూటీ తమన్న తరచూ వార్తల్లో నిలుస్తుంది అన్న విషయం తెలిసిందే. అయితే కెరియర్ మొదటి నుంచి కూడా నోకిస్ పాలసీతో ముందుకు సాగిన తమన్నా మొన్నటికి మొన్న లస్ట్ స్టోరీస్ 2 అనే వెబ్ సిరీస్ కోసం మాత్రం తన పాలసీని పక్కన పెట్టేసింది. కేవలం కిస్ సీన్ లో నటించడం మాత్రమే కాదు.. ఇంటిమేట్ సీన్లో కూడా నటించి అభిమానులందరినీ కూడా ఆశ్చర్యానికి గురిచేసింది అన్న విషయం తెలిసిందే. అయితే తమన్న ఇలా బోల్డ్ గా నటించడంపై విమర్శలు కూడా ఎదుర్కొంది.

 అయితే ఈ వెబ్ సిరీస్ లో కలిసి నటించిన విజయ్ వర్మతో ఇక ప్రస్తుతం డేటింగ్ లో మునిగి తేలుతుంది ఈ సొగసరి. ఈ క్రమంలోనే తన ప్రేమ వ్యవహారంతో తరుచు వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోతుంది అన్న విషయం తెలిసిందే. ఇక వీరిద్దరు ఎక్కడ ఇంటర్వ్యూ లో పాల్గొన్న వీరు కామెంట్స్ ఎప్పుడు హాట్ టాపిక్ గా మారిపోతూనే ఉన్నాయి. అయితే మొన్నటి వరకు వీరి ప్రేమ పై వచ్చిన టాక్.. కేవలం వార్తలు మాత్రమే అనుకున్నప్పటికీ వీరిద్దరూ ఓపెన్ అవడంతో చివరికి అందరికీ క్లారిటీ వచ్చింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేము అన్నట్టు ఇటీవలే మరోసారి ఈ జంట స్టేట్మెంట్ ఇచ్చారు.

 అయితే ఇక విజయ్ వర్మ తమన్నా త్వరలో పెళ్లి చేసుకోపోవడం ఖాయం అంటూ అందరూ ఫిక్స్ అయిపోతున్నారు. ఇలాంటి నేపద్యంలో మిల్కీ బ్యూటీ తమన్న తెలంగాణ కోడలు కాబోతుంది అంటూ నెట్టింట చర్చ జరుగుతుంది. మరి ప్రియుడు విజయ్ పరిస్థితి ఏంటి అని కంగారుపడుతున్నారా.. విజయ్ గురించి తమన్నా  బయటకు చెప్పిన తర్వాత  అభిమానులు అతని గురించి ఆరాలు తీయడం మొదలుపెట్టారు. కాగా బాలీవుడ్ నటుడు విజయ్ ముంబైకి చెందిన వ్యక్తి అనిఅందరూ అనుకుంటారు. కానీ సమాచారం ప్రకారం విజయ్ పక్కాహైదరాబాదినట. కాకపోతే వారి కుటుంబ చాలా కాలం క్రితమే ముంబైకి షిఫ్ట్ అయిందట. ఇక అక్కడే విజయ్ మోడల్ గా మారడం నటుడుగా ఎదగటం  జరిగాయి. అయితే ఇప్పటికి వారి బంధువులు ఇతర కుటుంబ సభ్యులు హైదరాబాద్ లోనే ఉన్నారట. ఇలా ఓ లెక్కన చూస్తే హైదరాబాది అయిన విజయ్ కి భార్యగా తమన్నా మారబోతుంది. అంటే తెలంగాణ కోడలే కదా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: