ఒక్క ఫైట్ సీన్ లేకున్నా.. బ్లాక్ బస్టర్ అయిన బాలయ్య సినిమా ఏదో తెలుసా?
అందుకే బాలకృష్ణకు ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంటుంది అని చెప్పాలి. బాలకృష్ణ ఏదైనా సినిమాలో నటిస్తున్నాడు అంటే చాలు ఆ సినిమాలో ఫైటింగ్ సీన్స్ ఒక రేంజ్ లో ఊహకందని రీతిలో ఉంటాయని అభిమానులు కూడా అంచనాలు పెట్టుకుంటూ ఉంటారు. అయితే అటు దర్శకులు కూడా అభిమానులు ఊహించినట్లుగానే భారీ యాక్షన్ సీక్వెన్స్ను బాలయ్య సినిమాలలో పెట్టడం లాంటివి చేస్తూ ఉంటారు. కానీ ఒక్క ఫైట్ కూడా లేకుండా బాలయ్య సినిమా వచ్చిందంటే అది అభిమానులకు అసలు నచ్చదు.
ఎందుకంటే బాలయ్య సినిమాలు అంటే అటు యాక్షన్ సీక్వెన్స్ కి పెట్టింది పేరు. అలాంటి బాలకృష్ణ కెరియర్ లో ఒక్క ఫైట్ సీన్ లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఉంది అంటే నమ్ముతారా.. ఇలా వచ్చిన సినిమా బ్లాక్ బస్టర్ కూడా సాధించిందట. ఆ సినిమా మరేదో కాదు నారీ నారీ నడుమ మురారి. కోదండరామిరెడ్డి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలయ్యకు జోడిగా శోభన, నిరోషా హీరోయిన్లుగా నటించారు. యువచిత్ర ఆర్ట్స్ బ్యానర్ పై కే మురారి ఈ సినిమాను నిర్మించారు. 1990లో ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు వచ్చింది. మంచి అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా విశేషంగా ఆకట్టుకుంది. అయితే ఈ సినిమాలో ఒక్కటంటే ఒక్క ఫైట్ సీన్ కూడా ఉండదు అని చెప్పాలి. అంతేకాదు ఈ సినిమా షూటింగ్ మొత్తం మెగాస్టార్ గెస్ట్ హౌస్ లో జరిగింది.