"గాంధేవదారి అర్జున" మూవీ టీజర్ విడుదల తేదీని... టైమ్ ను ప్రకటించిన మూవీ మేకర్స్..!

Pulgam Srinivas
తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు కలిగిన యువ దర్శకులలో ఒకరు అయినటు వంటి ప్రవీణ్ సత్తార్ గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ దర్శకుడు "చందమామ కథలు" అనే మూవీ తో దర్శకుడిగా తన కెరీర్ ను మొదలు పెట్టి మొదటి మూవీ తోనే అద్భుతమైన విజయాన్ని అందుకొని ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అదిరిపోయే రేంజ్ ప్రశంసలను అందుకున్నాడు. ఈ మూవీ తర్వాత ఈ దర్శకుడు "గుంటూరు టాకీస్" అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అపజయం అందుకుంది.


ఈ సినిమా తర్వాత ఈ దర్శకుడు సీనియర్ నటుడు రాజశేఖర్ హీరోగా రూపొందిన "గరుడ వేగ" సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన విజయం అందుకుంది  ఈ సినిమా తర్వాత ఈ దర్శకుడు టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున హీరోగా రూపొందిన "ది ఘోస్ట్" సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ విజయాన్ని అందుకుంది. ఇలా ఇప్పటి వరకు దర్శకత్వం వహించిన సినిమా లతో టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న ఈ దర్శకుడు ప్రస్తుతం మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న "గాందేవదరా అర్జున" అనే సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.


ఈ మూవీ కి సంబంధించిన షూటింగ్ ప్రస్తుతం ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ మేకర్స్ ఈ సినిమా టీజర్ విడుదలకు సంబంధించిన క్రేజీ అప్డేట్ ను ప్రకటించింది. జూలై 24 వ తేదీన ఉదయం 10 గంటల 08 నిమిషాలకు ఈ మూవీ టీజర్ ను విడుదల చేయనున్నట్లు ఈ మూవీ మేకర్స్ తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి ఈ మూవీ టీజర్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: