సినిమా ఇండస్ట్రీ లో మాస్ మహారాజ రవితేజ కు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకం గా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యం గా ఎటువంటి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీ లోకి వచ్చి ఇంతటి క్రేజీ స్థానాన్ని అందుకున్నాడు అంటే ఆయనలో ఎంత టాలెంట్ ఉందో కూడా మనం గమనించవచ్చు .సినిమా ఇండస్ట్రీ లో హిట్లు ఫ్లాపులు సర్వసాధారణం. ఎంత పెద్ద హీరో కైనా పాన్ ఇండియా లెవెల్ స్టార్ కైనా ఫ్లాప్స్ పడాల్సిందే . అలా ప్లాప్ పడినప్పుడే ఆ హీరో బౌన్స్ బ్యాక్ అవుతూ నెక్స్ట్ సినిమా క్రేజీ లెవెల్ లో తీస్తాడు.అయితే మహా మాస్ మహారాజ రవితేజ ఈ మధ్యకాలం లో వరుస ప్లాప్స్ అందుకుంటు వచ్చాడు . అలా ఫ్లాప్స్ కి బ్రేక్ చెప్పిన సినిమా ధమాకా . రవితేజ కెరియర్ లోనే వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడమే కాకుండా కెరియర్ లో ఫస్ట్ టైం 100 కోట్లు కలెక్ట్ చేసిన మూవీ గా రికార్డులు నెలకొల్పింది ధమాకా . ఈ సినిమా లో హీరోయిన్గా శ్రీ లీల నటించింది . అయితేశ్రీలీల పాత్ర లో ముందుగానే డైరెక్టర్ త్రినాధరావు నక్కిన రష్మిక మందన్నాను అనుకున్నారట .అయితే వరుస ప్లాప్ లో ఉన్న రవితేజ సరసన నటిస్తే ఆమె క్రేజ్ - రేంజ్ - డిమాండ్ తగ్గిపోతుంది అని రష్మిక రిజెక్ట్ చేసిందట . ఆ తర్వాత యంగ్ బ్యూటీ శ్రీలీల సినిమాను ఓకే చేసి సూపర్ డూపర్ హిట్ తన ఖాతా లో వేసుకుంది. అంతేకాదు ఈ సినిమా విజయానికి రవితేజ ఎంత కారణమో శ్రీలీల కూడా అంతే కారణ మంటూ ప్రూవ్ చేసింది. దీంతో మంచి ఛాన్స్ మిస్ అయినట్లయింది రష్మిక మందన్నా