తెలుగు సినిమా ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న కొంత మంది హీరోలకు సంబంధించిన మూవీ ల షూటింగ్ లు ప్రస్తుతం చిత్రీకరణల దశలో ఉన్నాయి ఆ మూవీ లు ఏవి ... ప్రస్తుతం ఆ సినిమా షూటింగ్ లు ఎక్కడ జరుగుతున్నాయి అనే విషయాలను తెలుసుకుందాం.
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా జాన్వి కపూర్ హీరోయిన్ గా కొరటాల శివ దర్శకత్వంలో ప్రస్తుతం దేవర సినిమా రూపొందుతుంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం శంషాబాద్ పరిసర ప్రాంతాల్లో ఎన్టీఆర్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.
రామ్ చరణ్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో ప్రస్తుతం గేమ్ చేంజర్ అనే సినిమా రూపొందుతుంది. ఈ మూవీ ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ మూవీ యూనిట్ అన్నపూర్ణ 7 ఎకర్స్ లో రామ్ చరణ్ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ప్రస్తుతం భగవంత్ కేసరి అనే సినిమా రూపొందుతుంది. ఈ సినిమాలో శ్రీ లీల కీలక పాత్రలో కనిపించబోతుంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం రామోజీ ఫిలిం సిటీ లో శ్రీ లీల పై కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.
రామ్ పోతినేని హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతం డబల్ ఈస్మార్ట్ అనే మూవీ రూపొందుతుంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం ముంబై లో రామ్ పోతినేని పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.
రవితేజ ప్రస్తుతం టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాలో రవితేజ దొంగ పాత్రలో కనిపించబోతున్నాడు. ఇకపోతే ప్రస్తుతం ఈ మూవీ బృందం ఏ ఎఫ్ లో రవితేజ పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తుంది.
ఇది ఇలా ఉంటే ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ 5 మూవీ లపై కూడా తెలుగు సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి.