మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన కెరియర్ లో ఇప్పటి వరకు ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. అలా రామ్ చరణ్ కెరియర్ లో బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయం సాధించిన సినిమాలలో రంగస్థలం మూవీ ఒకటి. 2018 వ సంవత్సరం విడుదల అయిన ఈ సినిమా అప్పట్లో బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బాస్టర్ విజయాన్ని సాధించడం మాత్రమే కాకుండా నాన్ బాహుబలి కలెక్షన్ లను వసూలు చేసింది. ఈ మూవీ లో రామ్ చరణ్ "చిట్టి బాబు" అనే పాత్రలో నటించి తన నటనతో ప్రేక్షకులను ఎంత గానో అలరించాడు.
ఈ మూవీ లోని చరణ్ నటనకు గాను ప్రేక్షకుల నుండి ... విమర్శకుల నుండి అద్భుతమైన ప్రశంసలు లభించాయి. ఇకపోతే ఈ మూవీ లో సమంత ... చరణ్ సరసన హీరోయిన్ గా నటించగా ... మోస్ట్ టాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. మైత్రి సంస్థ వారు భారీ బడ్జెట్ తో నిర్మించిన ఈ సినిమాకు రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించగా ... ఈ మూవీ లో ఆది పినిశెట్టి ... జగపతి బాబు ... ప్రకాష్ రాజ్ కీలక పాత్రలలో నటించారు. ఇలా ఆ సమయంలో బ్లాక్ బస్టర్ విజయం సాధించిన ఈ సినిమాను తాజాగా జూలై 14 వ తేదీన జపాన్ లో విడుదల చేశారు. జపాన్ లో ఈ మూవీ కి మొదటి నుండే ప్రేక్షకులు మంచి రెస్పాన్స్ లభించింది.
ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ జపాన్ లో ఫస్ట్ వీకెండ్ ను కంప్లీట్ చేసుకుంది. ఫస్ట్ వీకెండ్ పూర్తి అయ్యే సరికి రంగస్థలం మూవీ జపాన్ లో 59.7 లక్షల కలెక్షన్ లను వసూలు చేసింది. ఓవరాల్ గా చూసుకుంటే మొదటి వీకెండ్ లో రంగస్థలం మూవీ కి జపాన్ లో అదిరిపోయే సూపర్ సాలిడ్ కలెక్షన్ లు వచ్చాయి అని చెప్పవచ్చు.