బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్న మహానటి కీర్తి సురేష్ ....!!

murali krishna
టాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లలో మహానటి గా పేరు పొందిన కీర్తి సురేష్ ఈ మధ్య కొంచం హాట్ డోస్ పెంచిందనే చెప్పాలి. ఏమైందో తెలియదుకాని ఆమెలో సడన్ గా చాలా చేంజెస్ వచ్చాయని అభిమానులు అనుకుంటున్నారు. ఇదంతా సినిమా ఆఫర్స్ కోసమా అని అనుకుంటున్నారు. ఐతే గత కొంతకాలంగా దక్షిణాది టాప్‌ హీరోయిన్లు బాలీవుడ్‌పై మనసుపడుతోన్నారు. ఇప్పటికే సమంత, రష్మిక మందన్న బాలీవుడ్‌లో అడుగుపెట్టగా త్వరలోనే జవాన్ సినిమాతో నయనతార కూడా హిందీలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నది.వీరి బాటలోనే మరో హీరోయిన్ కీర్తిసురేష్ అడుగులు వేయనున్నట్లు సమాచారం.

తేరీ హిందీ రీమేక్‌తో కీర్తిసురేష్ బాలీవుడ్‌లోకి అరంగేట్రం చేయనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఒరిజినల్‌ లో సమంత చేసిన క్యారెక్టర్‌ను హిందీలో కీర్తిసురేష్‌ రీప్లేస్ చేయనుందని సమాచారం.ఈ రీమేక్‌లో వరుణ్‌ధావన్ హీరోగా నటించనున్నాడు. తేరీ మాతృకకు దర్శకత్వం వహించిన అట్లీ బాలీవుడ్ రీమేక్‌కు మాత్రం ప్రజెంటర్‌గా వ్యవహరించనున్నాడని తెలిసింది. అతడి భార్య ప్రియా అట్లీ ఈ బాలీవుడ్ మూవీని ప్రొడ్యూస్ చేయనున్నట్లు తెలిసింది. ఈ రీమేక్‌కు ఖలీస్ దర్శకత్వ బాధ్యతల్ని చేపట్టబోతున్నట్లు చెబుతోన్నారు. తేరీ మాతృకతో పోలిస్తే హిందీ రీమేక్‌లో చాలా మార్పులు చేసినట్లు సమాచారం. ఆగస్ట్ నెలలో ముంబైలో తేరీ రీమేక్ షూటింగ్ మొదలయ్యే అవకాశం ఉందని చెబుతుంది.

వచ్చే ఏడాది మే నెలలో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు తెలిసింది. ఇటీవలే దసరా సినిమాతో తెలుగులో, మామన్నన్ మూవీతో తమిళంలో బిగ్గెస్ట్ కమర్షియల్ సక్సెస్‌లను అందుకున్నది కీర్తిసురేష్‌. ప్రస్తుతం మూడు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. మరోవైపు వరుణ్‌ధావన్. సమంతతో కలిసి సిటాటెడ్ అనే సిరీస్ చేస్తోన్నాడు.ఏదేమైనా కీర్తి సురేష్ కు బాలీవుడ్ బాగా కలిసిరావాలని ఆమె అభిమానులు ఎదురు చూస్తున్నారు. అలాగే తెలుగు చిత్ర పరిశ్రంలో కూడా మరెన్నో అవకాశలు రావాలని కోరుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: