ఆ మూవీ పై ప్రశంసల వర్షం కురిపించిన లెక్కల మాస్టర్ సుకుమార్....!!
ఇక తాజాగా స్టార్ డైరెక్టర్ సుకుమార్ కూడా బేబీ సినిమా పై ప్రశంసలు కురిపించారు.ఈయన పోస్ట్ చేస్తూ ఈ సూపర్ హిట్ సినిమా చూడడానికి ఇన్ని రోజులకు సమయం దొరికింది అని సినిమా చూసిన తర్వాత ఇలాంటి అసాధారణమైన రచనలను చూసి చాలా కాలం అయ్యిందంటూ తెలిపారు. ఇది ఒక కొత్త వేవ్ అని కొత్త నమూనాను తీసుకు వచ్చింది.. ప్రతి సన్నివేశం సస్పెన్స్ థ్రిల్లర్ లా ఉంది.ఇటువంటి సినిమా ను నిర్మించినందుకు సాయి రాజేష్ గారికి వందనాలు.అలాగే నిర్మాతలను కూడా నేను అభినందిస్తున్నాను. వైష్ణవి నటించిన పాత్ర ఇప్పటి వరకు అత్యంత ప్రసిద్ధ చెందిన పాత్రలలో ఒకటి.. ఆనంద్, విరాజ్, వైష్ణవి నటన ఎంతో ఆకట్టుకుంది.ఈ సినిమా సూపర్ హిట్ అందుకున్నందుకు టీమ్ మొత్తానికి నా అభినందనలు అంటూ ఈయన ఇచ్చిన రివ్యూ నెట్టింట వైరల్ అవుతుంది. ఇలాంటి స్టార్ డైరెక్టర్ చేత కూడా ప్రశంసలు అందుకుని బేబీ సినిమా మరో పెట్టు పైకి ఎక్కింది.