అప్పుడు జరిగిన దానికి ఇంకా ఇబ్బంది పడుతున్న సాయి ధరమ్ తేజ్...!!
ఇందులో భాగంగా సాయిధరమ్ తేజ్ డాన్స్ గురించి తీవ్రస్థాయి లో విమర్శలు వచ్చాయి. అయితే ఈ ప్రమోషన్ కార్యక్రమాల లో సాయిధరమ్ తేజ్ ఈ విమర్శల గురించి మాట్లాడుతూ పలు విషయాలను వెల్లడించారు.సాయి ధరమ్ తేజ్ మునపటి లాగా డాన్స్ చేయడం లేదని ఆయనలో ఆ జోష్ కనిపించడం లేదని విమర్శలు వచ్చాయి. ఈ విమర్శల పై స్పందించిన సాయి ధరమ్ తేజ్ బైక్ ప్రమాదం తర్వాత తనకు పునర్జన్మ లభించిందని అయితే ఆ సమయంలో తనకు ఇచ్చిన మెడిసిన్స్, స్టెరాయిడ్స్ కారణం గా తన బాడీలో ఇప్పటికీ కొన్ని చిన్న చిన్న సమస్యలు ఉన్నాయని తెలిపారు. తన డాన్స్ చూసి ప్రేక్షకులకు మాత్రమే కాకుండా తాను నిరాశ పడ్డానని తెలిపారు. అయితే దీనిని నేను సాకుగా చెప్పను తప్పకుండా తిరిగి మునపటిలా డాన్స్ చేసి ప్రేక్షకులను సందడి చేస్తానని, కాకపోతే కొంత సమయం పడుతుందని ఈయన చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.