కమెడియన్ బబ్లు.. ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలుసా?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులు ఎప్పుడూ కొత్తవారు వస్తూ ఉంటారు. అచ్చం ఇలాగే అటు కమెడియన్స్ కూడా ఎప్పటికప్పుడు కొత్తవారు ఇండస్ట్రీకి పరిచయం అవుతూ ఉంటారు అని చెప్పాలి. ఇలా వచ్చినవారు ఇక సూపర్ సక్సెస్ అయ్యి వరుస అవకాశాలు అందుకుంటూ స్టార్ కమెడియన్ ఎదిగితే.  కొంతమంది మాత్రం కొన్ని సినిమాలకే పరిమితం అవుతూ ఉంటారు. మరి కొంతమంది చేసింది కొన్ని సినిమాలే అయినా ప్రేక్షకుల మధిలో చెరగని ముద్ర వేసుకుంటూ ఉంటారు అని చెప్పాలి.


 ఇలా చేసిన కొన్ని సినిమాల తోనే ప్రేక్షకుల్లో మంచి ముద్ర వేసుకున్న కమెడియన్ గా ఉన్నాడు బబ్లు. తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన బబ్లు స్టార్ కమెడియన్ ఎదగలేకపోయాడు. కానీ ఎంతో మంది స్టార్ హీరోలు సినిమాల్లో నటించాడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా ప్రతి ఒక్కరి సినిమాలో నటించాడు. ఇక ఇతని కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులు అందరిని పొట్ట చెక్కలయ్యేలా నవ్వించలేదు. కానీ స్టార్ హీరోల సినిమాల్లో కనిపించడంతో అందరికీ గుర్తుండిపోయాడు.


 కానీ ఆ తర్వాత కాలం లో అవకాశాలు రాకపోవడంతో బబ్లు ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయాడు. కనీసం ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా కనిపించడం లేదు. అయితే కొన్ని రోజుల కిందటే ఓ ఇంటర్వ్యూలో బబ్లు తన పర్సనల్ లైఫ్ కి  సంబంధించిన కొన్ని విషయాలు చెప్పుకొచ్చాడు  బబ్లు కెరియర్ పీక్ రేంజ్ లో కొనసాగుతున్న సమయంలోనే అతనికి ఎంతో ఇష్టమైన తండ్రి చనిపోయాడట  అప్పటినుంచి బబ్లు జీవితం మారిపోయిందట   చాలా కాలం వరకు ఏ సినిమాని ఆయన ఒప్పుకోలేదు. తర్వాత కెరియర్ లో గ్యాప్ వచ్చిందని బబ్లు చెప్పుకొచ్చాడు  ఆ తర్వాత అవకాశాల కోసం ట్రై చేసిన రాలేదు అంటూ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: