"సామజవరగమన" మూవీతో మొదటిసారి ఆ రికార్డును సొంతం చేసుకున్న శ్రీ విష్ణు..!

Pulgam Srinivas
టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయినటు వంటి శ్రీ విష్ణు గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఈ యువ నటుడు ఎన్నో విజయాలను అందుకొని తెలుగు సినిమా ఇండస్ట్రీ లో మంచి గుర్తింపు గల నటుడిగా కెరియర్ ను ముందుకు సాగిస్తున్నాడు. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితం ఈ నటుడు అల్లూరి అనే పవర్ఫుల్ సినిమాలో హీరోగా నటించాడు. ఈ సినిమా మంచి అంచనాల నడుమ విడుదల అయినప్పటికీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ప్రేక్షకులను తీవ్ర నిరుత్సాహ పరిచింది. ఇకపోతే ఈ మూవీ "ఓ టి టి" లో కూడా ప్రేక్షకులను పెద్దగా అలరించ లేక పోయింది.
 


ఇది ఇలా ఉంటే తాజాగా ఈ యువ నటుడు సామజవరగమన అనే ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ లో హీరో గా నటించాడు. ఈ మూవీ కి రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించగా ... నరేష్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించాడు. ఈ మూవీ కొన్ని రోజుల క్రితమే మంచి అంచనాల నడుమ విడుదల అయ్యి అద్భుతమైన కలెక్షన్ లను వాసులు చేసి ఇప్పటికే బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని సొంతం చేసుకుంది. ఇకపోతే ఇప్పటికి కూడా ఈ సినిమా థియేటర్ లలో విజయవంతంగా ప్రదర్శించబడుతుంది. ఇది ఇలా ఉంటే ఈ మూవీ మరి కొన్ని రోజుల్లో ఆహా "ఓ టి టి" ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ కాబోతుంది.


ఈ విషయాన్ని ఆహా డిజిటల్ ప్లాట్ ఫామ్ అధికారికంగా ప్రకటించింది. ఇది ఇలా ఉంటే తాజాగా ఈ మూవీ బృందం ఈ సినిమా "యూఎస్ఏ" లో 1 మిలియన్ కలెక్షన్ లను సాధించినట్లు అధికారికంగా ప్రకటించింది. అలాగే శ్రీ విష్ణు కెరియర్ లో కూడా ఈ సినిమానే ఫస్ట్ వన్ మిలియన్ కలెక్షన్ లను "యుఎస్ఎ" లో సాధించినట్లు ఈ మూవీ బృందం తాజాగా అధికారికంగా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: