కృష్ణుడు పాత్రలో కనబడునున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్...!!

murali krishna
యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ వంశీ పైడిపల్లి దర్శకత్వం లో తెరకెక్కిన బృందావనం సినిమా లో కొన్ని సెకన్ల పాటు కృష్ణుని రోల్ లో కనిపించగా తారక్ అలా కనిపించడం ఫ్యాన్స్ కు ఎంతగానో నచ్చింది.తారక్ ప్రస్తుతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సినిమాల లో వార్ 2 ఒకటి కాగా ఈ సినిమా లో హృతిక్ రోషన్, తారక్ మొదట స్నేహితులుగా ఉంటారని తర్వాత శత్రువులు గా మారతారని తెలుస్తోంది.కృష్ణార్జునుల పాత్రలను రెఫరెన్స్ గా తీసుకుని కృష్ణుడి పాత్ర ను పోలి ఉండేలా తారక్ రోల్ ను, అర్జునుడి పాత్రను పోలి ఉండేలా హృతిక్ రోల్ ను ఫిక్స్ చేశారని సమాచారం అందుతోంది. ఫ్యాన్స్ కు పండగ అనే విధంగా ఈ సినిమా ఉండనుందని తెలుస్తోంది. వార్2 సినిమా లో తారక్ రోల్ ఒకింత నెగిటివ్ షేడ్స్ తో ఉండబోతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వార్2 సినిమా రిలీజయ్యేది 2025 లోనే అని సమాచారం.

2024లో దేవర సినిమా తో ప్రేక్షకుల ముందుకు రానున్న తారక్ 2025 సంవత్సరం లో మాత్రం రెండు సినిమాల తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. తారక్ తన సినిమాల షూటింగ్ ను సైలెంట్ గా పూర్తి చేస్తుండటం ఫ్యాన్స్ కు సంతోషాన్ని కలిగిస్తోంది. వరుసగా మూడు ప్రాజెక్ట్ లను తారక్ ప్రకటించగా ఈ సినిమాలను కొన్ని నెలల గ్యాప్ లో తారక్ థియేటర్ల లో విడుదల చేస్తుండటం గమనార్హం.తన సినిమాల షూటింగ్ షెడ్యూల్స్ కు అనుగుణంగా జరిగేలా తారక్ ప్లాన్ చేస్తున్నారని సినిమాలకు సంబంధించి తన వైపు నుంచి ఏ పొరపాటు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారని సమాచారం అందుతోంది. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకున్నారని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తారక్ తన సినిమాలలో ఎక్కువగా బాలీవుడ్ హీరోయిన్లకు ప్రాధాన్యత ఇస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: